కూతురి విజయం.. ఆ కన్నతండ్రికి గర్వకారణమైంది..
ఐఏఎస్ కూతురైన ఉమా హారతికి.. ఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ తండ్రి వెంకటేశ్వర్లు సెల్యూట్..

సిద్దిపేట టైమ్స్, బ్యూరో
కూతురి విజయం.. ఆ కన్నతండ్రికి గర్వకారణమైంది. తాన పనిచేస్తున్న తెలంగాణ పోలీస్ అకాడెమీకి వచ్చిన ట్రైనీ
ఐఏఎస్ కూతురైన ఉమా హారతికి.. ఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ స్థానంలో తండ్రి వెంకటేశ్వర్లు సెల్యూట్ కొట్టారు. శనివారం హైదరాబాద్ పోలీసు అకాడమీకి వచ్చిన ట్రైనీ ఐఏఎస్ కూతురు ఉమా హారతికి ఎస్పీ ర్యాంకులో ఉన్న తండ్రి సెల్యూట్ చేశారు. తెలంగాణ పోలీసు అకాడమీలో ఎన్ వెంకటేశ్వర్లు డిప్యూటీ డైరక్టర్ గా పనిచేస్తున్నారు. ఆయన కూతురు ఉమ హారతి 2022 యూపీఎస్సీ సివిల్స్ ఎగ్జామ్స్ లో ఆల్ ఇండియా మూడో ర్యాంకు సాధించారు. ప్రస్తుతం ట్రైనింగులో ఉన్న ఉమ హారతి శనివారం తెలంగాణ పోలీసు అకాడమీకి వెళ్లారు. ఐఏఎస్ అధికారి హోదాలో వచ్చిన ఉమా హారతికి టీజీపీఏ డిప్యూటీ డైరక్టర్ ఎన్ వెంకటేశ్వర్లు సెల్యూట్ చేసి స్వాగతం చెప్పారు. ఐఏఎస్ కావాలని కలలు కన్న ఆ తండ్రి ఐపీఎస్ హోదాలో తన కూతురుకి అఫిషియల్ సెల్యూట్ చేశారు.. కూతురికి సెల్యూట్ చేస్తూ గర్వంగా ఫీలయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో లు అందరిని ఆకర్షిస్తున్నాయి. తమ కలలు సాకారం చేసిన కూతురు తాను డ్యూటీ చేస్తున్న చోటకు రావడంతో తండ్రి వెంకటేశ్వర్లు సెల్యూట్ చేసి ఆహ్వానించిన తీరు ప్రశంసలు కురిపిస్తున్నారు.





