జేఈఈ అడ్వాన్స్ లో సత్తా చాటిన విదీప్ రెడ్డి..
అల్ ఇండియ 36 వ ర్యాంకు సాధించిన విదీప్..
సిద్దిపేట టైమ్స్, బ్యూరో
జేఈఈ అడ్వాన్స్ ఫలితాల్లో జాలపల్లి విదీప్ రెడ్డి తన సత్తా చూపించాడు. బెంగళూరుకు చెందిన అలెన్ కెరీర్ ఇన్స్టిట్యూట్ విద్యార్తి సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ వాసి NIT వరంగల్ పూర్వ విద్యార్థి జాలపల్లి విజయ్ రెడ్డి (విశ్రాంత సాఫ్ట్వేర్ ఇంజనీర్, బెంగళూర్) కుమారుడు విదీప్ రెడ్డి JEE అడ్వాన్స్ లో ఆల్ ఇండియా 36 వ ర్యాంక్ సాధించాడు. ఈ సందర్భంగా ఉత్తమర్యాంకు సాధించిన జె విదీప్ రెడ్డి మాట్లాడుతూ.. తనకు సాధారణంగా ఫిజిక్స్ మరియు మ్యాథ్స్ అంటే చాలా ఇష్టమైన, అయితే కంప్యూటర్ సైన్స్ చదివే ఐఐటీ లో ఏంతో మంది తెలివైనవారు ఉంటారని, తనకు తెలుసు అన్నారు. తన చుట్టూ ఉన్నవారు బాగా రాణిస్తుంటే.. వారి కంటే తాను బాగా రానించాలని పట్టుదల తో చదివనని, దేశంలోని అత్యుత్తమ కాలేజీ ల విద్యార్థుల తో పోటీ పడాలని నేను కోరుకున్నానని, కనీసం టాప్ సెవెన్ ఐఐటీల్లో ఒకదానికి ర్యాంక్ వచ్చి సిటు వస్తున్నదని అనుకున్నాను.. కానీ 36 ర్యాంక్ వస్తుందని ఊహించలేదని ప్రతి రోజు అధ్యాపకులు ఇచ్చే మెటీరియల్ తో పాటు నెట్ లో లభించే మెటీరియల్ ప్రిపేర్ అయ్యానన్నారు. ఈ ర్యాంక్ రావటం తనకు చాలా సంతోషంగా ఉన్నదని, దేశంలో ఏ యూనివర్సిటీ లో నైనా సిటు వస్తున్నదని ఆశాభావం వ్యక్తం చేశారు.