ఏబీవీపీ హుస్నాబాద్ శాఖ ఆధ్వర్యంలో వీర సావర్కర్ జయంతి వేడుకలు
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో వినాయక్ దామోదర్ సావర్కర్ 141వ జయంతిని పురస్కరించుకొని ఏబీవీపీ హుస్నాబాద్ నగర కార్యదర్శి రాకేష్ వీర సావర్కర్ చిత్రపటానికి పులమాల వేసి ఘనంగా జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సావర్కర్ పేరులోనే స్వాతంత్రం ఉందని, వారి జీవితమే స్వాతంత్ర పోరాటం అని భరతమాత ముద్దుబిడ్డ దేశం కోసం 25 సంవత్సరాలు జైలు జీవితాన్ని గడిపిన గొప్ప స్వాతంత్ర సమర యోధుడని మధన్ లాల్, టింగ్ర, చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్ లాంటి ఎందరో గొప్ప గొప్ప దేశభక్తులకు స్పూర్తిగా నిలిచిన మహనీయుడని వారి రచనలతో, కవితలతో ప్రసంగాల ద్వారా ప్రతి ఒక్కరిలో దేశభక్తిని రగిలించిన వీరుడని అన్నారు. నేటి యువతకు స్వాతంత్ర వీర సావర్కర్ మార్గదర్శకంగా నిలిచారని సావర్కర్ పోరాట స్ఫూర్తితో యువత మొత్తం వారి అడుగుజాడల్లో నడవాలని కోరారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ పట్టణ ఉపాధ్యక్షులు రాజేష్, చరణ్, పట్టణ sfd కన్వీనర్ సంతోష్, బాలు తదితరులు పాల్గొన్నారు.





