ఇండియా ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ జాతీయ కౌన్సిల్ సభ్యునిగా వరయోగుల మురళీధర్ స్వామి ఎన్నిక
సిద్దిపేట టైమ్స్ డెస్క్:

ఇండియా ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ జాతీయ కౌన్సిల్ సభ్యునిగా వరయోగుల మురళీధర్ స్వామిని ఎన్నుకున్నట్టు
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు రాష్ట్ర కన్వీనర్ మామిడి సోమయ్య ప్రకటించారు. ఆదివారం సిద్దిపేట పట్టణంలో జరిగిన టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా మూడవ మహాసభలను ఘనంగా నిర్వహించారు. ఈ సభకు రాష్ట్ర కన్వీనర్ మామిడి సోమయ్యతో పాటు కో కన్వీనర్ లు పి. ఆనందం, తన్నీరు శ్రీనివాస్, బండి విజయ్ కుమార్, వల్లాల జగన్, కుడితాడి బాపురావు హాజరయ్యారు. ఈ సందర్బంగా సిద్దిపేట జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షునిగా సత్తు మహిపాల్ రెడ్డి, కార్యదర్శిగా మహమ్మద్ ఖుద్రత్ అలీ, ఉపాధ్యక్షులుగా ఆకుల రాజు, కోశాధికారి కుడిక్యాల సంపత్, సహాయ కార్యదర్శి ఎదబోయిన శ్రీనివాస్ రెడ్డి, కార్యవర్గ సభ్యులుగా ధర్మపురి సందీప్, చెరుకు సతీష్ ఎన్నుకున్నారు. ఈ మహాసభలో జిల్లా యూనియన్ జర్నలిస్ట్ లు వంద మంది పాల్గొన్నారు.




