వంజరి సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ
సిద్దిపేట్ టైమ్స్ రామాయంపేట
నిజాంపేట మండల కేంద్రంలోని వంజరి సంఘం లో ఆదివారం రాష్ట్ర వంజరి సంఘం ఉపాధ్యక్షులు వై. వెంకటేశం,వంజరి కులస్తుల ఆధ్వర్యంలో వంజరి సంఘం క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వంజరి కుల బాంధవులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. వంజరి కులంలో 90% పైబడి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థినీ విద్యార్థులకు పదివేల రూపాయలను అందిస్తూ వారి పై చదువుల కొరకు అండగా నిలుస్తున్నామన్నారు. మునుమందు వంజరి సంఘ కులస్తులకు అండగా ఉంటూ కుల సంఘ అభివృద్ధికి తోడ్పడుతామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ వంజరి సంఘం అధ్యక్షులు సదాశివలింగం,ఉపాధ్యక్షులు కొండేరు ప్రభాకర్,ప్రధాన కార్యదర్శి మావురం లక్ష్మణ్,కార్యదర్శి మావురం అంజయ్య,కోశాధికారి ఆముదరాజు, చంద్రశేఖర్, సిద్ధరాములు, కృష్ణకాంత్, వెంకటయ్య, నరేష్, సాయి, సరవ్వ, రాజు, బాల్ రాజు, తదితరులు పాల్గొన్నారు.