మహిళా రైతు కన్నీళ్లకు స్పందించిన కేంద్ర మంత్రి బండి సంజయ్
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాంగోపాల్ రెడ్డి చేతుల మీదుగా ₹50,000 ల సహాయం
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్, అక్టోబర్ 31:

హుస్నాబాద్ మండలంలోని పోతారం గ్రామానికి చెందిన మహిళా రైతు కేడిక తారవ్వ ఐదు ఎకరాల్లో వరి పంటను సాగు చేశారు. పంటను కోసి గత వారం రోజుల క్రితం హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డుకు అమ్మకానికి తీసుకువెళ్లగా, మాయిశ్చర్ శాతం అధికంగా ఉందని అధికారులు కొనుగోలు నిలిపివేయడం జరిగింది. తరువాత తారవ్వ మార్కెట్ యార్డులోనే పది ట్రాక్టర్ల ధాన్యాన్ని ఆరబెట్టగా, అకస్మాత్తుగా వచ్చిన ‘మొంథా’ తుఫాన్ కారణంగా భారీ వర్షాలు కురిసి, వరద నీరు మార్కెట్ యార్డులోకి చేరింది. దీంతో ఆమె ధాన్యం పూర్తిగా తడిసి, సుమారు 2–3 ట్రిప్పుల వడ్లు మురికి కాలువలో కొట్టుకుపోయాయి. ఈ సంఘటనతో తీవ్ర ఆవేదనకు గురైన ఆ మహిళా రైతు కన్నీళ్లు పెట్టుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ వీడియోలు కేంద్ర హోంసహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ గారి దృష్టికి చేరగా, ఆయన మానవతా దృక్పథంతో వెంటనే స్పందించారు.
బండి సంజయ్ స్వయంగా తారవ కి ఫోన్ చేసి ధైర్యం చెప్పి, “అధైర్యపడకు… నేనున్నాను, నీకు సహాయం చేస్తాను” అని భరోసా ఇచ్చారు. బండి సంజయ్ ఆదేశాల మేరకు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి తారవకి ₹50,000 నగదు సహాయం అందజేశారు.
ఈ కార్యక్రమంలో మండల బీజేపీ అధ్యక్షులు లక్కిరెడ్డి తిరుమల, అక్కన్నపేట మండల అధ్యక్షులు రామంచ మహేందర్ రెడ్డి, మాజీ మండల అధ్యక్షులు వెల్దండి రాజేంద్ర ప్రసాద్, చెక్కబండి విద్యాసాగర్ రెడ్డి, సగరపు లక్ష్మణ్, మోహన్ నాయక్, మడక రవి, సలేంద్ర తిరుపతి, తిరుపతి నాయక్, రాజు నాయక్, కుంట మల్లయ్య, బొల్లి శ్రీనివాస్, బైరి అరుణ్, మూతగడ్డల బాలరాజు, రావుల చంద్రశేఖర్ రెడ్డి, చంద్రమౌళి, పెనాల శ్రీనివాస్, తడిసిన రత్నాకర్ రెడ్డి, బొల్లి సుధాకర్, కొలిపాక కిరణ్, ఇటిక్యాల కుమారస్వామి, లావుడియా ధన్సింగ్, బానోతు రాములు, పుట్ట కొమురయ్య, శ్రీనివాస్ రెడ్డి, పోలు సందీప్, బాలరాజు తదితర భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.





