చోరికి యత్నించిన గుర్తు తెలియని వ్యక్తులు
మహిళ మేడలోని బంగారు గొలుసు ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నం
సిద్దిపేట టైమ్స్,ధూళిమిట్ట:
గుర్తుతెలియని వ్యక్తులు ఇద్దరు పట్టపగలే చోరికి యత్నించిన సంఘటన ధూళిమిట్ట మండలంలోని బైరాన్ పల్లి గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన చామంతుల కల్పన ఇల్లు ఊరి చివరన ఉంది. ముసుగులు ధరించి ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు బైక్ పై వచ్చి ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి కల్పన మేడలోని 3 తులాల బంగారు గొలుసును తెంపి ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు.ఆమె మేడలోని బంగారు గొలుసు ఇంటి పైకప్పు పై విసిరి కేకలు వేయడంతో భయంతో దుండగులు పారిపోయారు. ఘటన స్థలాన్ని హుస్నాబాద్ ఏసీపీ సదానందం, చేర్యాల సీఐ ఎల్ శ్రీను సందర్శించి డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు నిర్వహించారు. పట్టపగలే దుండగులు ఇలా చోరికి ప్రయత్నించడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు త్వరగా దుండగులను పట్టుకోవాలని పలువురు ప్రజలు కోరుతున్నారు.





