మెదక్ జిల్లా ఎస్పీ గా ఉదయ్ కుమార్ రెడ్డి
సిద్దిపేట టైమ్స్: మెదక్ ప్రత్యేక ప్రతినిధి:
మెదక్ జిల్లా నూతన ఎస్పీ గా ఉదయ్ కుమార్ రెడ్డి నియమితులయ్యారు. మెదక్ జిల్లా ఎస్పీ గా ఉన్న బాలస్వామి నీ హైదరాబాద్ ఈస్టు జోన్ డీసీపీ గా నియమించారు. కాగా హైద్రాబాద్ సౌత్ జొన్ డీసీపీ గా ఉన్న ఉదయ్ కుమార్ రెడ్డి నీ మెదక్ జిల్లా ఎస్పీ గా నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీచేసింది.