బైక్ అదుపు తప్పి ఇద్దరు యువకుల మృతి..
హవేలీ ఘనపూర్ మండలం
జక్కన్నపేట్ లో విషాదం
సిద్దిపేట టైమ్స్: మెదక్ ప్రత్యేక ప్రతినిధి:
బైక్ అదుపుతప్పి ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన హవేలి ఘనపూర్ మండలం ఫరీద్ పూర్ సమీపంలో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది.
మండలంలోని జక్కన్నపేటకు చెందిన జక్కని ప్రభాకర్ (25), మామిండ్ల మహేష్ (24)లు బైక్ పై వెళ్తుండగా అదుపు తప్పి పొలంలోకి వెళ్లడంతో ప్రభాకర్ స్పాట్ లో మృతి చెందాడు. మహేష్ కు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. మృతదేహాలను మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.