దొంగతనాలు దోపిడీలకు పాల్పడిన ఇద్దరు నిందితులు అరెస్ట్
సిద్దిపేట టైమ్స్,చేర్యాల:
సిద్దిపేట జిల్లా మద్దూరు పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస దొంగతనాలు, దోపిడీ ఘటనలకు పాల్పడిన ఇద్దరు నిందితులను మద్దూరు పోలీసులు అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించినట్లు హుస్నాబాద్ ఏసీపీ సదానందం శనివారం తెలిపారు. ఈ సందర్భంగా చేర్యాల పోలీస్ స్టేషన్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ మాట్లాడి వివరాలు వెల్లడించారు.ధూళిమిట్ట మండలం జాలపల్లి గ్రామానికి చెందిన గుండెల్లి రమేష్(32),లింగాపూర్ గ్రామానికి చెందిన మాసంపల్లి రాములు(31) పలు దొంగతనాలకు పాల్పడ్డారు. దొంగిలించిన డబ్బును జూదాల్లో ఖర్చు చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు.బంగారు, వెండి వస్తువులను అమ్ముకోవడానికి వెళ్తుండగా లింగాపూర్ గ్రామ శివారులో పోలీసులు పట్టుకున్నట్లు తెలిపారు.నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సిబ్బందిని ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ అభినందించారు. కేసును ఛేదించడంలో చేర్యాల సీఐ రమేష్ నాయక్, మద్దూరు ఎస్ఐ ఎండీ అసిఫ్,కానిస్టేబుల్స్ రవి, అనిల్, నాగరాజు, గణేష్ ముఖ్య పాత్ర వహించిన్నట్లు ఏసీపీ తెలిపారు.
Posted inతాజావార్తలు తెలంగాణ మద్దూరు
దొంగతనాలు దోపిడీలకు పాల్పడిన ఇద్దరు నిందితులు అరెస్ట్



