తెలంగాణలో జూన్ 9న జరగబోయే గ్రూప్ 1 హాల్ టికెట్ ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల నుండి అందుబాటులోకి తీసుకువచ్చింది. గ్రూప్ 1 పరీక్ష కోసం నమోదు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ tspsc.gov.inను సందర్శించి TSPSC గ్రూప్ 1 హాల్ టికెట్ 2024ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
తెలంగాణ TSPSC గ్రూప్ 1 అడ్మిట్ కార్డ్ 2024ని డౌన్లోడ్ చేసుకునేందుకు అభ్యర్థులు వారి ID, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసిన తర్వాత వచ్చిన క్యాప్చాను ఎంటర్ చేయడం ద్వారా హాల్ టిక్కెట్లను పొందవచ్చు. ఇక ప్రిలిమినరీ పరీక్ష జూన్ 9, 2024న ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:00 వరకు జరగనుంది. క్రింద ఇచ్చిన వెబ్సైట్ లింక్ నుండి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
https://hallticket.tspsc.gov.in/h022024bac31765-311a-4142-a99f-b96023c172b2