TSPSC గ్రూప్1 ప్రిలిమ్స్: జూన్ 1వ తేదీ నుంచి వెబ్‌సైట్లో హాల్‌టికెట్లు

TSPSC గ్రూప్1 ప్రిలిమ్స్: జూన్ 1వ తేదీ నుంచి వెబ్‌సైట్లో హాల్‌టికెట్లు

సిద్దిపేట టైమ్స్:

జూన్ 1 న గ్రూప్ 1 ప్రిలిమ్స్ హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని వెబ్ నోటు విడుదల చేసిన TSPSC. తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరవాత TSPSC తొలిసారిగా నిర్వహిస్తున్న గ్రూప్ – 1 ప్రిలిమ్స్ పరీక్షకి పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. జూన్ 9న ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 1.00 వరకు జరిగే ఈ పరీక్షకు 4.03 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే పరీక్ష కేంద్రాల గుర్తింపు, భద్రతా ఏర్పాట్లు బాధ్యతలపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో, టెలి కాన్ఫరెన్స్‌ నిర్వహించింది. జూన్‌ 1 మధ్యాహ్నం 2 గంటల నుండి హాల్‌టికెట్లు అందుబాటులో ఉండనున్నాయని బుధవారం TSPSC తన వెబ్సైట్లో వెబ్ నోటును విడుదల చేసింది. అభ్యర్థుల ను ఉదయం 9 గంటల నుండి ఎగ్జామ్స్ సెంటర్ కు అనుమతిస్తారని ఉదయం 10 గంటలకు పరీక్ష కేంద్రాల గేట్లను మూసివేస్తారని ఈ వెబ్ నోటు లో తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు హాల్‌టికెట్లు జూన్ 1 న విడుదలయ్యాక అధికారిక వెబ్‌సైట్‌ https://tspsc.gov.in/ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *