కార్యకర్తలకు అండగా భారత రాష్ట్ర సమితి పార్టీ
రెండు లక్షల చెక్కు అందజేసిన మాజీ ఎమ్మెల్యే సతీష్ బాబు
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
ప్రమాదవశాత్తు మరణించిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త కు పార్టీ సభ్యత్వ ప్రమాద బీమా రెండు లక్షల రూపాయలు అందజేస్తూ బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటుందని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితేల సతీష్ కుమార్ అన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గం సైదాపూర్ మండలము వెన్నంపల్లి గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్త పిన్రెడ్డి రాంరెడ్డి ప్రమాదవశాత్తూ మరణించగా భారత రాష్ట్ర సమితి పార్టీ సభ్యత్వ ప్రమాద బీమా ద్వారా మంజూరైన 2 లక్షల విలువైన చెక్కును నామినీ గా ఉన్న ఆయన భార్య పద్మ కి మరియు ఎల్కతుర్తి మండలం దామెర గ్రామానికి చెందిన టిఆర్ఎస్ కార్యకర్త జైపాల్ రెడ్డి ప్రమాదవశాత్తు మరణించగా భార్య లక్ష్మి కి రెండు లక్షల విలువైన చెక్కును వారి కుటుంబ సభ్యుల సమక్షంలో మాజీ MLA సతీష్ కుమార్ అందజేశారు.. ఈ కార్యక్రమం లోరాష్ట్ర ఎంపీపీ ల ఫోరం అధ్యక్షులు సారాబుడ్ల ప్రభాకర్ రెడ్డి, మండల బా రాస పార్టి అధ్యక్షులు సోమ రపు రాజయ్య, పాక్స్ అధ్య్యక్షులు బిల్ల వెంకట్ రెడ్డి, బా రాస మండల ప్రధాన కార్యదర్శి చెల్మల రాజేశ్వర్ రెడ్డి, మాజీ సర్పంచ్ కయిత రాములు, పోతరాజు సంపత్ పాల్గొన్నారు.
