పెళ్లింట విషాదం.. తండ్రి కొడుకు మృతి..
కరెంట్ షాకు తో రైతులు మృతి..
వ్యవసాయ పొలంలో పని చేస్తుండగా ఘటన..
శోక సంద్రంలో చంద్లాపూర్..


సిద్దిపేట టైమ్స్, సిద్దిపేట ప్రతినిధి, ఆగస్టు 18
కరెంట్ షాక్ తో తండ్రి, కొడుకు మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం
చంద్లాపూర్ లో జరిగింది. ఐదు రోజుల క్రితం పెళ్లి వేడుకలు జరిగిన ఆ ఇంట్లో తీవ్ర విషాదాన్ని నింపిన ఈ సంఘటనకు సంబంధించి స్థానకులు తెలిపిన వివరాలిలా వున్నాయి. చంద్లాపూర్ కు చెందిన మూర్తి గజేందర్ రెడ్డి( తండ్రి), రాజిరెడ్డి (కొడుకు) ఇద్దరు గంగాపూర్ లోని వ్యవసాయ బావి వద్ద అడవి పందుల బెడద నుంచి మొక్కజొన్నను రక్షించేందుకు వైర్ చుడుతుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి అక్కడిక్కడే తండ్రి, కొడుకు మృతి చెందారు. కాగా ఐదు రోజుల క్రితం గజేందర్ రెడ్డి తన కూతురు పెళ్ళి ఘనంగా చేశారు. పెళ్లింట విషాదం నెలకొనడం తో చంద్లాపూర్ శోకసంద్రంలో మునిగిపోయింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.





