రేపే 1996-97 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం..

పుట్టిన ఊరు.. కన్నతల్లి.. చదువుకున్న పాఠశాలను ఎంత ఎత్తుకు ఎదిగిన మరవకూడదని గుర్తు చేస్తూ.. ఎంత పెద్ద ఉన్నత స్థాయి కి ఎదిగిన తల్లిదండ్రులను.. గురువులను.. ఎప్పటికి మరవకుడదు.. అనే నినాదంతో ముందుకు సాగుతూ…
రేపు 1996-97 చిన్నాకోడూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. సిద్దిపేట జిల్లా చిన్నాకోడూరు లో గల జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థులు 1996 ,1997 బ్యాచ్ విద్యార్థుల ఆత్మీయ సమావేశం ఆదివారం జరగనుంది. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశ ఏర్పాటు కమీటి మాట్లాడుతూ మన తల్లిదండ్రులు మన గురువులు మన స్నేహితులు వారితో గడిపిన మధుర అనుభవాన్ని, మన జీవితంలోకి వెలుగు తెచ్చిన ప్రతి ఒక్క గురువుకి ప్రత్యేక ఆహ్వానం అని తెలిపారు. రేపు నిర్వహించుకోనున్న ఆత్మీయ సమ్మేళనానికి ప్రతి ఒక్కరు ఆ చిన్న నాటి ఉత్సాహాం.. ఏ మాత్రం తగ్గకుండా నిర్వహించుకోవడం జరుగుతోంది. అదే ఉత్సాహాం తో ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు ప్రతి ఒక్కరూ పాల్గొనాలని తెలిపారు.