సెంట్రల్ బ్యాంకు ద్వారా సకాలంలో రుణాల మంజూరు..
హైదరాబాద్ జోన్ అధిపతి ధారాసింగ్ నాయక్..
సిద్దిపేట్ టైమ్స్, రామాయంపేట

దేశంలో ఉన్న సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా రైతులకు, వ్యాపారస్తులకు, చిరు మధ్యతరగతి వారికి ఆలస్యం లేకుండా సకాలంలో రుణాలను మంజూరు చేస్తున్నామని ఆ బ్యాంకు హైదరాబాద్ జోన్ ఆధిపతి ధారా సింగ్ నాయక్ వెల్లడించారు. బ్యాంకు ద్వారా అందించే రుణాలతో వ్యాపారాలు అభివృద్ధి చేసుకొని బ్యాంకు ను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలని సెంట్రల్ బ్యాంక్ హెడ్ ధారాసింగ్ నాయక్ అన్నారు. రామాయంపేట మండల కేంద్రంలో శనివారం నూతన బ్యాంకు భవనాన్ని ఆయన ప్రారంభించారు. రామాయంపేటలో 1971లో సెంట్రల్ బ్యాంక్ ప్రారంభించామని, నేటికి 43 సంవత్సరాలు పూర్తయిందని, 90 కోట్ల టర్నోవర్ తో బ్యాంకు ముందుకు సాగుతుందని తెలిపారు. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించేందుకు డిజిటల్ సేవలను అందుబాటులోకి తెచ్చామని, ఈ అవకాశాన్ని ఖాతాదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. రోజు రోజుకు సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఈ సందర్భంగా ఖాతాదారులను సాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో రీజినల్ హెడ్ కృష్ణమోహన్, బ్యాంకు మేనేజర్ డి.బీముడు నాయక్, మున్సిపల్ కౌన్సిలర్ దేమే యాదగిరి, టి యు డబ్ల్యూ జె (iju) రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు
డి.జి.శ్రీనివాస శర్మ ఖాతాదారులు ఎన్ని శెట్టి సంతోష్, పబ్బ చంద్రo,
బ్యాంకు సిబ్బంది జన్ను ప్రసాద్, భరద్వాన్ పాన్ లాల్ తో పాటు వివిధ ప్రాంతాల నుండి సెంట్రల్ బ్యాంకు మేనేజర్ లు తదితరులు పాల్గొన్నారు.
