గంజాయి తాగుతూ,అమ్మడానికి ప్రయత్నించిన ముగ్గురు వ్యక్తులు అరెస్టు
సిద్దిపేట టైమ్స్,మద్దూరు(అక్టోబర్,10):
గంజాయి తాగుతూ,అమ్మడానికి ప్రయత్నించిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 123 గ్రాముల గంజాయి,2 సెల్‌ఫోన్ లు, ఒక బైక్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం మద్దూరు పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో చేర్యాల సిఐ ఎల్ శ్రీను మాట్లాడారు.మండలంలోని ఉప్పరోనిగడ్డ శివారులో గంజాయి తాగుతూ,అమ్మడానికి ప్రయత్నిస్తున్నారని సమాచారం అందుకున్న సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు మరియు ఎస్ఐ షేక్ మహబూబ్ తన సిబ్బందితో కలిసి ఆప్రాంతానికి చేరుకుని పండ్ల ప్రణయ్ కుమార్, గడ్డం, ప్రవీణ్, మహమ్మద్ సోహెల్ అనే ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద 123 గ్రాముల గంజాయిని,2 సెల్‌ఫోన్ లు,ఒక బైక్ స్వాధీనం చేసుకున్నారు.ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి జ్యూడిషల్ రిమాండ్ కు తరలించినట్లు సిఐ తెలిపారు.
Posted inతాజావార్తలు తెలంగాణ మద్దూరు
గంజాయి తాగుతూ,అమ్మడానికి ప్రయత్నించిన ముగ్గురు వ్యక్తులు అరెస్టు





