చంపుతామని బెదిరిస్తున్నారు రక్షణ కల్పించండి
పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన గిరిజన మహిళ
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్, అక్కన్నపేట:
హుస్నాబాద్ నియోజకవర్గంలోని అక్కన్నపేట మండలం చాపగానితండా పరిధిలోని తెల్లపలుగుతండాకు చెందిన మాలోతు లక్ష్మికి అదే గ్రామానికి చెందిన కొంత మందితో ప్రాణం భయం ఉందని వారి నుండి తనకు రక్షణ కల్పించాలని వేడుకుంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా చేసిన ఫిర్యాదులో తాను శుక్రవారం రోజున మద్యాహ్నం సమయంలో తమకు ఉన్న మూగజీవాలైన మేకలను కాయుచుండగా మేకలు తన పొలంలో మేసాయని బానోతు వీరన్న అనే వ్యక్తి తనతో గొడవ పడ్డారని,తన మేకలు చేను మేయలేదని చెప్పినా నోటికి వచ్చినట్లు దూశించడంతో పాటు తమకు ఉన్న పాత కక్షలను మనసులో పెట్టుకుని అదేరోజు సాయంత్రం 6గంటలకు మరో 8మందిని వెంట వేసుకుని తమ ఇంటికి దాడి చేసేందుకు రాగా భయంతో తాను తలుపులు దగ్గర వేపుకోగా వాళ్లతో తమ ఇంటిపై దాడి చేయడంతో పాటు చంపుతామని బెదిరింపులకు దిగారని వారితో తనకు ప్రాణ భయం ఉందని వారి నుండి తనకు రక్షణ కల్పించడంతో పాటు తన ఇంటిపై దాడి చేసి తనను భయబ్రాంతులకు గురి చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పెర్కొనట్లు తెలిపారు.