రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలకు తావులేదు
కేటీఆర్ పై..కొండాసురేఖ వ్యాఖ్యలను ఖండించిన మాజీ ఎమ్మెల్యే సతీష్
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:-
తెలంగాణ మంత్రి కొండా సురేఖ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై చేసిన ఆరోపణలు ఆక్షేపణీయమని, హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. మంత్రి హోదాలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని ప్రశ్నించారు. కొండా సురేఖకు కేటీఆర్ పై చేసిన ఆరోపణలపై న్యాయ పరంగా ముందుకు వెళ్తామని, కొండా సురేఖ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని సతీష్ డిమాండ్ చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు రాజకీయ ప్రత్యర్థుల మీద దాడికి వాడుకోవడం కాంగ్రెస్ పార్టీ నీచ సంస్కృతికి నిదర్శనమని అభివర్ణించారు. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని, రాజకీయ ప్రత్యర్ధులని విమర్శించేందుకు వాడుకోవద్దనే విషయం తెలియదా అని ప్రశ్నించారు. సాటి మనుషుల వ్యక్తిగత విషయాలని గౌరవించాలని, బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళగా ఇతర మహిళలపై ఇలా అసంబద్ధ వ్యాఖ్యలు చేయవద్దని హితువు పలికారు. రాజకీయాల్లో వ్యక్తిగత ఆరోపణలు చేయకూడదని, తిరిగి భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలకు ఆస్కారం ఇవ్వకూడదని, వ్యవస్థలో ఉన్న లోటు పాట్ల గురించి మాట్లాడాలి తప్ప, సమాజానికి ఆదర్శంగా ఉండాలే తప్ప ఇలా మంత్రి చేసిన ఆరోపణల వల్ల కేటీఆర్ కుటుంబ సభ్యులు బాధపడతారని అర్థం కాలేదా అని, తోటి మహిళగా మీరు ఆలోచించారా అని ప్రశ్నించారు. బాధ్యత గల పదవిలో ఉండి..మంత్రి సురేఖ బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం సరికాదని పేర్కొన్నారు.
Posted inహుస్నాబాద్
రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలకు తావులేదు
