ఓటే గ్రామాభివృద్ధికి పునాది..
బీజేపీ జిల్లా అధ్యక్షులు గంటా రవి కుమార్
సిద్దిపేట టైమ్స్ వరంగల్:
గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఓటే గ్రామాభివృద్ధికి పునాదని భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంటా రవి కుమార్ పిలుపునిచ్చారు. రెండో విడత సర్పంచ్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పంతిని గ్రామంలో ఆయన ఓటు హక్కు ప్రాముఖ్యతపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా గంటా రవి కుమార్ మాట్లాడుతూ… ఓటు హక్కు వినియోగం ద్వారానే ప్రజలు తమ గ్రామాల అభివృద్ధిలో భాగస్వాములు అవుతారని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు పవిత్రమైందని, ప్రతి గ్రామస్థుడు బాధ్యతగా పోలింగ్‌కు హాజరై ఓటు వేయాలని కోరారు. ప్రజా చైతన్యమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న గంటా రవి కుమార్, జి.ఆర్.కె ఫౌండేషన్ స్థాపకులుగా పేదలు, బలహీన వర్గాలకు నిరంతరం అండగా నిలుస్తూ ప్రత్యేక గుర్తింపు పొందారని గ్రామస్థులు పేర్కొన్నారు. వరంగల్ జిల్లా ప్రజల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించే నాయకుడిగా ఆయనకు మంచి పేరు ఉందన్నారు. ఈ కార్యక్రమంతో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొనగా, గంటా రవి కుమార్ నాయకత్వంలో పార్టీ క్యాడర్ రాబోయే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో చురుగ్గా పనిచేస్తుండటం గమనార్హం.





