పట్టభద్రుల, నిరుద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా.
విద్యాసంస్థల అధినేతగా అపార అనుభవం ఉంది.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోర్స్ అధినేత వి నరేందర్ రెడ్డి.
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్ :
నిరుద్యోగులు, పట్టభద్రుల పక్షాన శాసనమండలిలో గళం వినిపించ డానికే ఈసారి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వి.నరేందర్ రెడ్డి తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల సన్నద్ధంలో భాగంగా సిద్దిపేట జిల్లా హుస్నాబా ద్ లో ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి పర్యటిం చారు. ఈ సందర్భంగా హుస్నాబాద్ జిల్లా పరి షత్ బాలికల ఉన్నతపాఠశాలలో విద్యార్థులకు త్రాగునీటి కోసం ఏర్పాటు చేసిన వాటర్లోంట్ను ఆయన ప్రారంభించారు. అనంతరం తిరుమల గార్డెన్లో ఏర్పా టుచేసిన మీడియా సమావేశంలో నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ఆల్ఫోర్స్ విద్యా సంస్థల ద్వారా ఎంతోమంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి ఉన్నత భవిష్యత్తును అందించామన్నారు. ఇప్పుడు నిరుద్యోగులు, పట్టభద్రులకు అండగా ఉండడానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నానన్నారు. నిరుద్యోగులు, పట్టభద్రులు సమస్యల పట్ల శాసనమండలిలో ఇంతవరకు సమగ్రమైన చర్చ జరగడంలేదని, వారి సమస్యల పట్ల అవగాహన ఉన్న తను వారి సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానన్నారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న వారు, ఇదివరకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న వారు కూడా మళ్ళీ తమ కార్యాలయాలలో ఓటు హక్కు కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. నిరుద్యోగులకు ఒక సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి దాని ద్వారా లైబ్రరీలను, స్టడీ సెంటర్లను బలోపేతం చేస్తామన్నారు. ఉద్యోగుల సమస్యల పట్ల తనకు పూర్తి అవగాహన ఉందన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న తనను నిరుద్యోగులు, పట్టబద్రులు గెలిపించాలని కోరారు.