నిరుద్యోగుల గర్జన… చలో సెక్రటేరియట్ కు పిలుపునిచ్చిన నిరుద్యోగ యువత..
సిద్దిపేట టైమ్స్ డెస్క్:
10 డిమాండ్ల పరిష్కారమే లక్ష్యంగా నిరుద్యోగ యువత
రాష్ట్రంలో నిరుద్యోగుల డిమాండ్ల పరిష్కారం కోరుతూ ఈ రోజు రాష్ట్ర సచివాలయం ముట్టడి కార్యక్రమం నిర్వహించనున్నట్టు తెలంగాణ నిరుద్యోగ యువత పిలుపునిచ్చింది.
ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన 10 ప్రధాన డిమాండ్లను పరిష్కరించాలని ఈ ఆందోళన చేపడుతున్నట్టు తెలిపారు.
గ్రూప్-1 మెయిన్స్‌కు 1:100 నిష్పత్తి అమలు, రెండు లక్షల ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్, మూడు నెలలు డీఎస్సీ పరీక్షల వాయిదా, గ్రూప్ 2, 3 పరీక్షల వాయిదా, పోస్టుల సంఖ్య పెంపు తదితర హామీలను నెరవేర్చాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి నిరుద్యోగ యువత, వివిధ పరీక్షల అభ్యర్థులు పెద్ద ఎత్తున తరలివస్తారని పేర్కొన్నారు. ముట్టడి కార్యక్రమానికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ నేత ఆర్ కృష్ణయ్య, బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్, నిరుద్యోగ సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షుడు రాజారామ్ యాదవ్ తదితరులు సెక్రటేరియట్ గేటు వద్ద నిరుద్యోగులు నిర్వహించే శాంతియుత నిరసనకు మద్దతుగా రానున్నట్టు తెలిపారు.