హుస్నాబాద్ : మాటల్లో పెట్టి మెడలో చైన్ దొంగతనం చేసిన దుండగులు
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:


హుస్నాబాద్ పట్టణం నాగారం రోడ్డులో నడుచుకుంటూ వెళుతున్న బొద్దుల లచ్చవ్వ వయసు 65 అనే మహిళ మెడలోని రెండున్నర తులాల బంగారు గొలుసును శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తులు మాటల్లో పెట్టి దొంగతనం చేసి తీసుకెళ్లిపోయారు. బాధితురాలి కొడుకు మురళి తెలిపిన వివరాల మేరకు మధ్యాహ్నం నాగారం రోడ్డులో గల వెంకటరమణ డయాగ్నస్టిక్ సెంటర్ కు వచ్చి ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్న మహిళను ద్విచక్రవాహనంలో వచ్చిన ఇద్దరు దుండగులు మాటల్లో పెట్టి ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును దొంగతనం చేసి తీసుకెళ్లి పోయారు. తేరుకున్న మహిళ కొద్దిసేపటి తర్వాత అటుగా వెళుతున్న వారికి చెప్పడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి పట్టణ పోలీసులు చేరుకుని పరిశీలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హుస్నాబాద్ ఎస్సై మహేష్ తెలిపారు.