పోలీసు అమర వీరుల సేవలు చిరస్మరణీయం
పట్టణ పుర వీధుల గుండా అమర వీరులను స్మరించుకుంటూ సైకిల్ ర్యాలీ
ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థిని, విద్యార్థులు, ఏసిపి సతీష్ కుమార్
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
పోలీసు అమరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా హుస్నాబాద్ ఏసిపి సతీష్ కుమార్ శనివారం జెండా ఊపి సైకిల్ ర్యాలీ ప్రారంభించారు. ఈ సైకిల్ ర్యాలీ పట్టణంలోని పురవీధుల గుండా పోలీసు అమరులను స్మరించుకుంటూ విద్యార్థిని విద్యార్థులచే నిర్వహించగా వారు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏసీపి మాట్లాడారు. పోలీసు అమరులు చేసిన త్యాగాలను ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. వారిని అనునిత్యం స్మరించుకుంటూ నిరంతరం ప్రజలలో చిరస్మరణీయంగా ఉండడానికి ఇలాంటి కార్యక్రమాలు దోహద పడతాయని తద్వారా ప్రజలతో పోలీసుల సత్సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి ఉపయోగపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ సిఐ శ్రీనివాస్ బెజ్జంకి ఎస్సై అభిలాష్, అక్కన్నపేట ఎస్సై, విజయభాస్కర్ జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ సెక్రటరీ శ్రీనివాస్ పీఈటీలు ఐలయ్య, సత్యనారాయణ రెడ్డి, శ్రీనివాస్, రాజిరెడ్డి విద్యార్థిని మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


