డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల సమస్యలు పరిష్కరించాలి
బీఆర్ఎస్ నియోజకవర్గ అధికార ప్రతినిధి ఐలేని మల్లికార్జున్ రెడ్డి
కాలనీలో అంధకారం, డ్రైనేజీ అస్తవ్యస్తం
సిద్దిపేట టైమ్స్. హుస్నాబాద్ :
డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కాలనీలో అంధకారం నెలకొందని, డ్రైనేజీ వ్యవస్థ సైతం అస్తవ్యస్తంగా తయారై దుర్గంధం వెదజల్లుతున్నదని బీఆర్ఎస్ నియోజకవర్గ ప్రతినిధి ఐలేని మల్లికార్జున్రెడ్డి ఆరోపించారు. మంగళవారం డబుల్ బెడ్ రూమ్ ల వద్దకు వెళ్లి కాలనీవాసులు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. హుస్నాబాద్ పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ లలో నివసిస్తున్న వారు రాత్రి వేళల్లో వెళ్లాలంటే భయపడుతున్నారని,కాలనీలో పారిశుద్ధ్యం పూర్తిగా పడకేసిందని, కనీసం మునిసిపల్ అధికారుల సైతం కాలనీ వైపు కన్నెత్తి చూడడం లేదన్నారు. అలాగే పెండింగులో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ల నిర్మాణం పనులను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని, లబ్ధిదారులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కనికరించే పరిస్థితి లేదన్నారు. ఇల్లు లేని నిరుపేదలకు నీడ అందించడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ పథకం తీసుకొస్తే కనీసం పెండింగ్ లో ఉన్న నిర్మాణాలను పూర్తి చేయక చివరికి లబ్ధిదారులే సొంత డబ్బులు పెట్టుకొని అందులో ఉండే పరిస్థితి నెలకొందని అన్నారు. పేద ప్రజలను పట్టించుకోక అవసరం వచ్చినప్పుడు ఓట్లు అడిగితే తప్పకుండా ప్రజలే గుణపాఠం చెప్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో మల్లికార్జున్ రెడ్డి తో పాటు నియోజకవర్గ అధికార ప్రతినిధి సుద్దాల చంద్రయ్య, యూత్ విభాగ పట్టణ అధ్యక్షుడు మేకల వికాస్ యాదవ్, నాయకులు లక్ష్మణ్, సునీత మరియు డబుల్ బెడ్ రూమ్ కాలనీవాసులు ఉన్నారు.
Posted inహుస్నాబాద్
డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల సమస్యలు పరిష్కరించాలి





