హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి బీసీలకు కేటాయించాలి
నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ పచ్చిమట్ల రవీందర్ గౌడ్
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
తెలంగాణ వచ్చిన తర్వాత బి. సి సామాజిక వర్గం కు సంబంధించి ఇప్పటివరకు హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ రాకపోవడం చాలా బాధాకరం అని నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ పచ్చిమట్ల రవీందర్ గౌడ్ అన్నారు. హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని, గత టిఆర్ఎస్ పరిపాలనలో మాజీ ఎమ్మెల్యే సతీష్ బాబు దృష్టికి పలుమార్లు తీసుకెళ్లిన పట్టించుకో లేదన్నారు. బీసీలను ఓటు బ్యాంక్ గానే చూస్తున్నారు కానీ ఇప్పుడు బీసీ సామాజిక మంత్రి, బీసీల మద్దతుతో, బీసీలలో వచ్చిన ఐక్యత తో బి. సీ.సామాజిక వర్గ M. L. A ను గెలిపించు కోవడం జరిగిందన్నారు. బి. సి సామాజిక వర్గం కు ఎప్పుడు మార్కెట్ కమిటీ డైరెక్టర్లతోనే సరిపుచ్చుతున్నారని, గతంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఓసీలకు, ఎస్సీలకే వరించిన సందర్భాలు ఉన్నాయని, బీసీలకు అందని ద్రాక్షగా మారిన మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి విషయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆలోచన చేసి బీసీలకు న్యాయం చేయాలని, బీసీల ఆత్మ అభిమానాన్ని, ఓపికను అర్థం చేసుకోవాలని, B C సంక్షేమ సంఘం పక్షాన విజ్ఞప్తి చేశారు.