అక్కన్నపేట మండలం చౌటపల్లి గ్రామంలో ఆదివారం రాత్రి తెలంగాణ తల్లి విగ్రహానికి నిప్పు పెట్టిన గుర్తుతెలియని దుండగులు
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
తెలంగాణ తల్లి విగ్రహానికి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు అంటించిన ఘటన ఆదివారం రాత్రి సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని చౌటపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. సోమవారం అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ.. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు తెలంగాణ తల్లి పై కప్పి ఉంచిన బట్ట తో సహా విగ్రహాన్ని తగలబెట్టిన వ్యక్తులపై కఠినమైన చర్య తీసుకోవాలని అక్కన్నపేట ఎస్సై గారికి ఫోన్ చేసి తెలియజేశారు. ఈ ఘటనను చౌటపల్లి గ్రామ అఖిలపక్ష నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు పులికాసి రమేష్ పత్తిపాక త్రిమూర్తి, కుక్కల సంపతి, ఆవుల వెంకటరాజు, ఇల్లందుల రమేష్ మరియు చౌటపల్లి గ్రామ ప్రజలు అఖిలపక్ష నాయకులు తీవ్రంగా ఖండించారు.