ఇంటిని జాకీలతో పైకి ఎత్తారు.





సిద్దిపేట టైమ్స్, సిద్ధిపేట
ప్రస్తుతం కాలం మారింది. టెక్నాలజీ వింత పోకడలు పోతుంది. టెక్నాలజీ ఉపయోగించుకుంటే.. ఎదైనా మానవుడికి సాధ్యం కానిదంటూ లేకుండా పోయింది. సిద్దిపేట జిల్లాలో చేస్తున్న పనిని చూస్తే ఎవ్వరైనా ముక్కున వేలేసుకొని నివ్వేరపోయి చూడాల్సిందే. ఏంటదో మీరే చూడండి. సాధారణంగా జాకీలు వాహనాల రిపేర్లకు, టైర్లు మార్చేందుకు ఉపయోగించడం అందరం చూశాం. కాని అదే జాకీలతో ఇంటి ఎత్తును పెంచవచ్చంటే నమ్ముతారా..? ఎకంగ ఇంటిని పైకి ఎత్తారు ఇక్కడ.
సిద్దిపేట జిల్లాలో అదే జరిగింది. ఏకంగా ఏకంగా 15 ఏళ్ల క్రితం నిర్మించిన ఇంటిని 3 నుంచి 5 ఫీట్ల ఎత్తు పెంచేందుకు అధునాతనడ టెక్నాలజీని ఉపయోగించారు.
సిద్దిపేట జిల్లా సిద్ధిపేట కు చెందిన ఆరుట్ల యాదవ రెడ్డి
నిర్మించుకున్నాడు. అయితే కాలనుగుణంగా యాదవ రెడ్డి ఇల్లు రోడ్డుకు రెండు అడుగులు క్రిందికి చేరడంతో ఇంటిని జాకీల సహాయంతో పైకి లేపేందుకు.. భవానీ కన్సెక్షన్ కు చెందిన సంగేం మధుసూదన్ రెడ్డి 9807779777 ని
సంప్రదించాడు.
అంతే సుమారు 15 మంది కూలీల సాయంతో ఇంటిని 4 ఫీట్ల ఎత్తుకు లేపేందుకు సిద్దం అయ్యారు. ఇప్పటికే సుమారు 100 జాకీలతో పని మొదలెట్టారు. మూడు రోజుల్లో రెండు 4 అడుగుల పైకి లేపినట్లు తెలిపారు. మరో వారంలో కంప్లీంట్ చేస్తామని చెప్పారు. భవానీ నిర్మాణం అధినేత మధుసూదన్ రెడ్డి ఇంటిని ఐదు 4 అడుగులు పైకి ఎత్తు లేపేందుకు జాకీలతో పాటు ఐరన్ ఛానల్లు, పట్టా, కర్ర లను ఉపయోగిస్తున్నారు.





