ఏకకాలంలో 2 లక్షల రైతు రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వందే..

ఏకకాలంలో 2 లక్షల రైతు రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వందే..

ఏకకాలంలో 2 లక్షల రైతు రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వందే..

త్వరలో కొత్త రేషన్ కార్డులు, ఆరోగ్య శ్రీ కార్డులు

రుణమాఫీ కానీ వారు ఆందోళన చెందవద్ధు

రైతులు బిఆర్ఎస్, బీజేపీ చట్రంలో పడద్దు

బిఆర్ఎస్ హయంలో రైతు రుణమాఫీ ఎన్ని సంవత్సరాలు చేశారు.. ఎంత మందికి ఇచ్చారు

బీజేపీ ఈ 10 సంవత్సరాల్లో రైతులకు ఏమైనా చేసిందా

కేసిఆర్ ట్యూనింగ్ – కిషన్ రెడ్డి మ్యూజిక్ తో కాంగ్రెస్ ను విమర్శిస్తే మీకు మీరే అవమానించుకున్నట్టే

సెక్రటేరియట్ ముందు బరా బర్ రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టీ తీరుతాం

రాజీవ్ గాంధీ విగ్రహాన్ని టచ్ చేసే ధైర్యం ఉందా

కేటీఆర్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి

బీసీ సంక్షేమ మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:

దేశంలో చరిత్రలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతులకు ఏకకాలంలో 2 లక్షల రైతు రుణమాఫీ చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం దేనని రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ముఖ్య నేతలతో మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రతిపక్షాలు రైతాంగాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని రైతులు బిఆర్ఎస్, బీజేపీ చట్రంలో పడవద్దని సూచించారు. ఇప్పటి వరకు 2 లక్షల వరకు రైతు రుణమాఫీ పూర్తి అయిందని, ఎవరికైనా రుణమాఫీ కాకపోతే రైతాంగం ఆందోళన చెందవద్దని మండల కార్యాలయాల్లో వ్యవసాయ అధికారులను కలిసి అప్లికేషన్ ఇవ్వాలని సూచించారు. వారు పరిశీలించి అర్హులైన ప్రతి ఒక్కరికీ రుణమాఫీ అమలు అయ్యేలా చూస్తారని పేర్కొన్నారు. రైతు రుణమాఫీ 2018 డిసెంబర్ 12 కంటే ముందు, 2023 డిసెంబర్ 9 తరువాత లోన్ తీసుకున్న వారివి రుణ మాఫీ వర్తించదని పేర్కొన్నారు.

హుస్నాబాద్ లో సింగిల్ విండో ద్వారా 4000 మంది రైతులు సభ్యులుగా ఉంటే 900 మంది మాత్రమే అప్పు తీసుకున్నారు.. బిఆర్ఎస్ హయంలో లక్ష రూపాయల రైతు రుణమాఫీ విడతల వారిగా చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది అది తెలంగాణ రైతాంగం మొత్తానికి తెలుసు.. కానీ తమ ప్రభుత్వం ఒకే దశలో రైతు రుణమాఫీ పూర్తి చేశామని తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో మొదటి దశలో లక్ష రూపాయల రుణమాఫీ వరకు 18,260 మంది రైతులకు రుణమాఫీ జరిగగా మొదటి దశలో రూ. 96.26 లక్షలు విడుదలయ్యాయన్నారు. రెండవ దశ లో లక్ష 50 వేల వరకు రైతు రుణం ఉన్న వారికి ఉన్న వారికి 9436 మంది రైతులకు రూ. 87.36 కోట్ల రూపాయలు రుణమాఫీ కి విడుదల అయ్యాయనీ పేర్కొన్నారు. మూడవ దశలో 2 లక్షల లోపు రైతు రుణమాఫీ ఉన్న వారికి 7136 మంది రైతులకు రూ. 87.06 కోట్లు విడుదల అయ్యాయని ,ఒక హుస్నాబాద్ నియోజకవర్గంలోనే 34,882 మంది రైతులకు 269.6 కోట్లు రుణమాఫీ పూర్తి అయిందనీ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలియజేసారు. నియోజకవర్గంలో 70 శాతం మంది రైతులు లోన్ తీసుకున్నారు.ఇందులో రైతు రుణమాఫీ పూర్తి కానీ వారు 2018 డిసెంబర్ 12 కి ముందు ,2023 డిసెంబర్ 9 తరువాత లోన్ తీసుకున్న వారు ఉన్నారన్నారు. ఇంకా ఎవరైనా రుణమాఫీ పూర్తి కానీ వారు ఉంటే వ్యవసాయ అధికారులకు సమాచారం అందించాలని కోరారు. 2005 -06 తమ ప్రభుత్వం లో దేశం మొత్తం ప్రతి రైతుకు లక్ష రూపాయల రుణమాఫీ అమలు చేసిన ఘనత తమదేనని ,ఇప్పుడు చరిత్రలో దేశంలో ఎక్కడా లేని విధంగా 2 లక్షల రైతు రుణమాఫీ చేసిన చరిత్ర తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వందన్నారు

బిఆర్ఎస్10 ఏళ్లలో లక్ష రూపాయల రుణమాఫీ ఎన్ని విడతల్లో చేశారు..?ఎంత మంది కి ఇచ్చారు..? అని ప్రశ్నించారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రైతులకు ఏం చేసిందనేది రైతులకు చెప్పాలన్నారు.ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ 2 లక్షల వరకు రైతు రుణమాఫీ పూర్తి చేశామని ఇచ్చిన మాట ప్రకారం మాటమీద నిలబడే ప్రభుత్వం తమదని ఒకేసారి రుణమాఫీ చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నమన్నారు. ప్రతిపక్షాలు లోన్లు మాఫీ కాలేదని అబద్ధాలు ఆడుతున్నారని విమర్శించారు

కేటీఆర్ నిన్న సిరిసిల్ల మాట్లాడుతూ పాపన్న విగ్రహం పెట్టాలి అంటున్నారు. 10 ఏళ్లు మీరు అధికారంలో ఉండి పాపప్న విగ్రహం ఎందుకు పెట్టలేదనీ కేటీఆర్ ను ప్రశ్నించారు. తప్పకుండా పాపన్న విగ్రహం పెడతామని హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 కే గ్యాస్ అందిస్తున్నామని ఎవరికైనా రాకపోతే మండల కార్యాలయాల్లో కరెక్షన్ చేసుకోవాలనీ సూచించారు. త్వరలోనే కొత్త రేషన్ కార్డులు, ఆరోగ్య శ్రీ కార్డులు అందిస్తామని, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని హామీ ఇచ్చారు.

ఆర్టీసి చరిత్రలోనే గతంలో ఎప్పుడూ లేని విధంగా నిన్న ఒకరోజే 64 లక్షల మంది ప్రయాణం చేశారనీ సంతోషం వ్యక్తం చేశారు.నిన్న టికెట్ ద్వారా 15 కోట్ల ఆదాయం వచ్చిందనీ నిరంతరం శరమించిన ఆర్టీసి సిబ్బందికి అభినందనలు తెలిపారు. ఆర్టీసి నష్టాల నుండి క్రమంగా గట్టెక్కుతున్నమన్నారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇస్తుంటే మహిళలను అవమాన పరిచే విధంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆర్టీసి లో వెళ్లిపాయలు తీస్తూ కావాలని రీల్స్ చేస్తున్నారని ఇలాంటి వీడియోల పై చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ లో చర్చించామన్నారు.ఆర్టీసి లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వడం ప్రతిపక్షాలకు ఇష్టం లేదా అని ప్రశ్నించారు.ఓ వైపు ఆటో కార్మికులను రెచ్చగొడుతు పబ్బం గడుపుతున్నారాన్నారు. గతంలో హుస్నాబాద్ కేపి కాలనిలో దళితులకు ఉచిత విద్యుత్ ఇస్తుంటే మీటర్లు లక్కుపోయారని అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న మేమే అడ్డుకున్నమన్నారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకుండా తమ ప్రభుత్వం 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని తెలిపారు.

కెసిఆర్ ట్యూనింగ్, కిషన్ రెడ్డి మ్యూజిక్ ఇద్దరు కలిసి కాంగ్రెస్ నీ విమర్శిస్తే మీకు మీరే అవమానపరచుకున్నట్లేనని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇద్దరు కలిసి వచ్చిన పార్లమెంటు ఎన్నికల్లో 8 దాటలేదని హెద్దేవా చేసారు. రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో తమ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు.

సెక్రటేరియట్ ముందు బరా బర్ రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టీ తీరుతామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని టచ్ చేసే ధైర్యం ఉందా అని సవాలు విసిరారు.సెక్రటేరియట్ ముందు తాము ఎవరి విగ్రహం తొలగించలేదని ..ఎవరిని ఇబ్బంది పెట్టలేదన్నారు కేటీఆర్ ఆయన విగ్రహం పెట్టుకోవాలనుకున్నారో ఏమో అని సందేహం వ్యక్తం చేశారు.

దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన వ్యక్తి రాజీవ్ గాంధీ అని ఆయన విగ్రహం పై మాట్లాడుతున్న కేటీఆర్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలన్నారు.సాంకేతిక టెక్నాలజీ విప్లవాన్ని తెచ్చిన వ్యక్తి రాజీవ్ గాంధీ అని ప్రశంసించారు. త్వరలోనే అట్టహాసంగా సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహం పెడతామని ,సోనియా గాంధీ రాలేకపోవడం వల్లే ఈరోజు రాజీవ్ గాంధీ విగ్రహం ప్రారంభం కాలేదన్నారు.హైదరాబాద్ ఇంచార్జి మంత్రిగా సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహ పనులు పరిశిలించానన్నారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *