భవిష్యత్తు అంతా సాంకేతిక విద్యదే

భవిష్యత్తు అంతా సాంకేతిక విద్యదే

భవిష్యత్తు అంతా సాంకేతిక విద్యదే

విద్యార్థులు మారుతున్న కాలానికి అనుగుణంగా శాస్త్ర, సాంకేతిక రంగాల్లో రాణించాలి

పాఠశాలలో ఏర్పాటు చేసిన రోబోటిక్, కంప్యూటర్, సైన్స్, ఇంగ్లీష్ ల్యాబ్ లను ఉపయోగించుకోవాలి

హుస్నాబాద్ ప్రభుత్వ పాఠశాలకు కోటక్ మహేంద్ర సహకారంతో 25 లక్షలతో ఆడిటోరియం

విద్యార్థులందరూ చదువుతోపాటు అన్ని రంగాల్లో రాణించాలి

జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ లో నియోజకవర్గ ప్రభుత్వ పాఠశాలలు అత్యుత్తమ ప్రతిభ కనబర్చాలి.

రాష్ట్ర రవాణా మరియు బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:

భవిష్యత్తు అంతా సాంకేతిక విద్యదేనని, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు మారుతున్న కాలానికి అనుగుణంగా శాస్త్ర, సాంకేతిక రంగాల్లో రాణించాలని రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలునిచ్చారు. హుస్నాబాద్ ప్రభుత్వ జెడ్పిహెచ్ఎస్ బాయ్స్ & గర్ల్స్ పాఠశాలలో స్వచ్ఛంద సంస్థల సహకారంతో రోబోటిక్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, ఇంగ్లీష్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, పాఠశాల మొబైల్ యాప్ లను సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి తో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. హుస్నాబాద్ ప్రభుత్వ బాయ్స్ అండ్ గర్ల్స్ పాఠశాలలో సిద్దిపేట కలెక్టర్ మను చౌదరి చొరవతో రోబోటిక్ ల్యాబ్ సోహం అకాడమి, కంప్యూటర్ ల్యాబ్ నిర్మాన్ సంస్థ, సైన్స్ ల్యాబ్ ఇన్ఫినిటీ వైద్య ఫౌండేషన్ సహకారంతో ఏర్పాటు చేశారు. విద్యార్థులకు ఉపయోగపడే ల్యాబ్ లను మంత్రి పొన్నం ప్రభాకర్ లాంఛనంగా ప్రారంభించారు. రోబోటిక్ ల్యాబ్ లో మిని రోబో లు, సెన్సార్ లతో తయారు చేసిన అధునాతన పరికరాలను మంత్రి పొన్నం ప్రభాకర్, కలెక్టర్ మను చౌదరి పరిశీలించారు. సైన్స్ ల్యాబ్ లో పెరిస్కోప్, డిజిటల్ మైక్రో స్కోప్, డ్రోన్, టెలిస్కోప్, న్యూటన్ క్రడల్, మోటార్ డేయాన్స్టేషన్, మానవ శరీరంలో ఉండే అవయవాలు, హైడ్రో టర్బన్స్ తదితర 75 రకాల యాక్టివిటీస్ పరిశీలించారు. Nirman.org సహకారంతో కంప్యూటర్ ల్యాబ్ డిజిటల్ క్లాస్, డిజిటల్ బోర్డ్స్, సీసీ కెమెరాలు మొత్తం 20 కంప్యూటర్ లు  ఏర్పాటు చేశారు. విద్యార్థులు కంప్యూటర్ ల్యాబ్ ను వినియోగించుకొని సాంకేతిక విద్యను నేర్చుకోవాలని సూచించారు. ఇంగ్లీష్ ల్యాబ్ ద్వారా విద్యార్థులు భాషా నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలని కమ్యునికేషన్ స్కిల్స్ అభివృద్ధిపై ప్రత్యెక శ్రద్ధ చూపాలని సూచించారు.  స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ లో జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయిలో ఆటలు ఆడిన వారికి సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. హుస్నాబాద్ బాయ్స్ పాఠశాల నుండిజాతీయ స్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపికైన ఆశ్వద్ ను అభినందించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలోమంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. భవిష్యత్ లో పెరుగుతున్న సాంకేతికత నేపథ్యంలో సైన్స్ ల్యాబ్, రోబోటిక్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్ ను ఉపయోగించుకోవాలని విద్యార్థులకు సూచించారు.  విద్యార్థులు మేము ఏ రంగంలో తక్కువ కాదని చదువులతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని అన్ని స్కూల్ లలో సైన్స్, కంప్యూటర్, రోబోటిక్ ల్యాబ్ లు ఏర్పాటు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. సిద్దిపేట లో జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ ఉంటుందని కంపిటిషన్ లో హుస్నాబాద్ నుండి ప్రతి స్కూల్ పాల్గొనాలని ఉపాధ్యాయులకు ఆదేశించారు. ఫ్రైజ్ లు అన్నీ హుస్నాబాద్ నియోజకవర్గ సిద్దిపేట జిల్లాలో ఉన్న 3 మండలాల స్కూల్ లు ముందుండాలని తెలిపారు సైన్స్ ఉపాధ్యాయులు విద్యార్థులను మోటివేట్ చేయాలన్నారు. తల్లిదండ్రులు Zphs హుస్నాబాద్ పేరు మీద యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని పాఠశాల కార్యక్రమాలు తల్లిదండ్రులు తెలుసుకోవచ్చని సూచించారు. ప్రభుత్వ పాఠశాల కు కొటెక్ మహేంద్ర సంస్థ వారి సహకారంతో 25 లక్షల తో త్వరలోనే ఆడిటోరియం నిర్మిస్తామని పేర్కొన్నారు. భవిష్యత్ లో  మీకు కావాల్సిన  అవసరాలు తీర్చే బాధ్యత తనదని, మంచిగా శ్రమ పడి సాంకేతిక విద్య నిరంతర అభ్యసనం, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో ముందుడాలని సూచించారు. ఈనెల 14 వ తేది నుండి డిసెంబర్ వరకు ఉదయం, సాయంత్రం స్టేడియంలో ఉచిత యోగ క్లాస్ లు ఏర్పాటు చేశామని పట్టణ ప్రజలు ఉపయోగించుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. కంప్యూటర్ ల్యాబ్, ఇంగ్లీష్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, రోబోటిక్ ల్యాబ్ లను ఉపయోగించుకొని అన్ని రంగాల్లో రాణించాలని విద్యార్థులకు అవగాహన కల్పించారు.

సిద్దిపేట కలెక్టర్ మను చౌదరి మాట్లాడుతూ… కొత్తగా ప్రారంబించిన సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, ఇంగ్లీష్ ల్యాబ్ లను ఉపయోగించుకొని భవిష్యత్ కు బాటలు వేసుకోవాలని సూచించారు. మొబైల్ యాప్ ద్వారా  టీచర్స్, పేరెంట్స్ విద్యరుల స్టడీస్ పై నేరుగా అబ్జర్వ్ చేయగలరని తెలిపారు. విద్యార్థులు నేర్చుకోవడం కమ్యునికేషన్ స్కిల్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అభివృద్ధి చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి, మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న, కౌన్సిలర్లు, ఆర్డీవో , ఎంఈవో, మున్సిపల్ కమిషనర్, ఎమ్మార్వో , నిర్మన్ సంస్థ ప్రతినిధి ఉషకర్, ఇన్ఫినిటీ వైద్య ఫౌండేషన్ ప్రతినిధి కృష్ణా రెడ్డి , సోహం అకాడమి ప్రతినిధులు, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *