
మ



ార్కండేయ దేవాలయంలో ఘనంగా ధ్వజస్తంభ ప్రతిష్ట..
శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతి స్వామి ఆధ్వర్యంలో ఉత్సవాలు..
ప్రత్యేక పూజల్లో పాల్గొన్న కల్వకుంట్ల వంశీధర్ రావు, వంగా రాజేశ్వర్ రెడ్డి..
సిద్దిపేట టైమ్స్, సిద్దిపేట, ఫిబ్రవరి 28
సిద్దిపేట శ్రీ మార్కండేయ దేవాలయంలో పట్టణ పద్మశాలి సమాజం అద్వర్యం లో ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవం శ్రీ పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతి స్వామి వారి కరకమలములచే యంత్ర ప్రతిష్టా, ధ్వజప్రతిష్టా ఘనంగా జరిగింది. సమాజం అధ్యక్షుడు కాముని రాజేశం, సమాజం సభ్యుల ఆధ్వర్యంలో ఉదయం 8.00 గం॥లకు ఆవాహిత పూజ, గర్త సంస్కారము జరిగింది. సాయంత్రం 9.25 ని॥లకు : మేషలగ్న శుభాంశ సుముహుర్తమున శ్రీ పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతి స్వామి వారి కరకమలములచే యంత్ర ప్రతిష్టా, ధ్వజప్రతిష్టా, కళాన్యానం, న్యాసహవనము, ప్రాణ ప్రతిష్టా, బలిప్రదానము, పూర్ణాహుతి, అభిషేకము, అవభృథము, అన్నప్రసాదము, ఆశీర్వచనము, ఋత్విక్ సన్మానము నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కెవిఆర్ ఫౌండేషన్ చైర్మన్ కల్వకుంట్ల వంశీధర్ రావు, బిఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ వంగా రాజేశ్వర్ రెడ్డిలు ముఖ్య అతిధులుగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజ్యులు శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతి స్వామి వారి ఆశీర్వాదాలు పొందారు.
ఉపాధ్యక్షులు పెద్ది అశోక్, ఇప్పకాల శ్రీహరి, ప్రధాన కార్యదర్శి సిరిగాది బాల్ రాజు, సహాయ కార్యదర్శిలు గుండు రవితేజ (లడ్డు), చిలుక ఆంజనేయులు, కోశాధికారి సూరం ప్రసాద్, కార్యవర్గ సభ్యులు పెద్ది శ్రీనివాస్, బైరి ప్రకాష్, దీకొండ మహేష్, కొండబత్తిని రాజ్ కోటి, పేర్ల రాజేంద్రప్రసాద్, దండే సంతోష్ కుమార్, వీరబత్తిని నగేష్, ఆడేపు నాగరాజు, గోటిపాముల జలజ, సిరిముల్ సునీత, పుట్ట సునీత, యువజన సంఘం, మహిళా సంఘం, 43 వార్డుల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న కల్వకుంట వంశీధర్ రావు, వంగ రాజేశ్వర్ రెడ్డి లకు మరియు ఈ మహోత్సవాన్ని విజయవంతం చేసిన దేవస్థాన కమిటీ సభ్యులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.




