మాట ఇస్తే మడమ తిప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ
హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బంక చందు
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
హుస్నాబాద్ మండలం వంగ రామయ్య పల్లి గ్రామంలో గౌరవెల్లి ప్రాజెక్టుకు నిన్న బడ్జెట్లో 437 కోట్లు నిధులు కేటాయించినందుకు రైతులు ఆనందంతో పంట పొలాల్లో ముఖ్యమంత్రి మరియు మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ ప్రాంత ప్రజల యొక్క బాధలు తెలుసుకున్న నాయకుడై గౌరవెల్లి ప్రాజెక్టుకు ఫౌండేషన్ వేస్తే ఈరోజు రైతు బిడ్డ అయిన పొన్నం ప్రభాకర్ ప్రాజెక్టును పూర్తి చేసి రైతులకు నీళ్లు అందించే ఆలోచన తో యుద్ధప్రాతిపదికన గౌరవెల్లి ప్రాజెక్టు పనులకు శ్రీకారం చుడుతున్న ఉద్యమ నాయకుడని హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బంకచందు అన్నారు.
ఈ ప్రాంత ప్రజలకు గౌరవెల్లి ప్రాజెక్టు నిండితే చెరువుల్లో, కుంటలలో నీళ్లు వస్తాయి అందులో నీళ్లు ఉంటే బావుల్లో బోర్లలో నీళ్లు ఎక్కువగా ఉండి రెండు పంటలు చేతికి అందుతాయి రోజువారి కూలీలకు పని దొరుకుతుంది అని రైతు ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి రైతు రుణమాఫీ చేయడం జరిగింది ఏకకాలంలో ఇప్పుడు అలాగే రేవంత్ రెడ్డి ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసి రైతుల గుండెల్లో నిలిచిపోయిన నాయకుడని, మాట ఇస్తే మాట తప్పని పార్టీ మడమ తిప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాల మరియు పేదల పార్టీ అని, ఒక రైతు బిడ్డ హుస్నాబాద్ ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రిగా మాకు సేవలందిస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్ కి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి , ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు.