రైతులను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ
– రైతుబంధు ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం
– ధర్నాలో పాల్గొన్న దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి
సిద్దిపేట్ టైమ్స్ , దుబ్బాక ప్రతినిధి:
తెలంగాణ రాష్ట్ర రైతుల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం శాపంగా మారి ఏదైతే ఎన్నికల హామీలు భాగంగా ప్రతి రైతుకు సంవత్సరానికి 15000 రూపాయలు రైతుబంధు ఇస్తానని ఎన్నికల హామీ ఇచ్చి సంవత్సరం కాలం పాటు రైతుబంధు ఎగపెట్టి మళ్లీ మరోసారి రైతులను మోసం చేసిన రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రతి సంవత్సరం రైతులకు 12 వేల రూపాయలు మాత్రమే ఇవ్వగలమని చెప్పి రైతులను మోసం చేసి ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా గెలవడానికి ఎన్ని అబద్ధాలు అయినా ఆడచ్చని మరోసారి రుజువు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షాన ఈరోజు టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో దుబ్బాక నియోజకవర్గం దుబ్బాక మండలం హబ్సీపూర్ చౌరస్తాలో రైతులతో కలిసి ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించిన దుబ్బాక ఎమ్మెల్యే శ్రీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు వారితో పాటు దుబ్బాక నియోజకవర్గం లోని పలు గ్రామాల రైతులు టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ ప్రభుత్వం ఏదైతే ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలను కచ్చితంగా ఇచ్చేవరకు ఈ ప్రభుత్వాన్ని ఎండగడితేనే ఉంటాం రైతుల పక్షాన కచ్చితంగా మా పోరాటాన్ని మరో తెలంగాణ ఉద్యమంగా కూడా తీర్చిదిద్దడానికి ఏమాత్రం వెనకడుగు వేయమని దుబ్బాక ఎమ్మెల్యే శ్రీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు గుండెల్లి ఎల్లారెడ్డి, నియోజకవర్గంలోని ప్రజాప్రతినిదులు పాల్గొన్నారు.
