రాష్ట్రంలో విద్యారంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా భ్రష్టు పట్టించింది

రాష్ట్రంలో విద్యారంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా భ్రష్టు పట్టించింది

రాష్ట్రంలో విద్యారంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా భ్రష్టు పట్టించింది

గురుకులాల భవనాలకు అద్దె చెల్లించక తాళాలు పడుతున్న దుస్థితి

ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలి

గ్రూప్-1పరీక్ష వాయిదా వేయాలన్నందుకు అరెస్టు చేస్తారా.. హాస్టల్లోకి చొచ్చుకు వెళ్లి దౌర్జన్యం చేస్తారా

అగమ్య గోచరంగా మారిన వేలాది విద్యార్థుల భవిష్యత్తు

కాంగ్రెస్ అనాలోచిత నిర్ణయాలతో పేద మధ్యతరగతి ప్రజలు ఇబ్బందుల పాలు

గ్రూప్-1 అభ్యర్థుల పై పోలీసుల దాష్టీకాన్ని ఖండించిన మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్

సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్, అక్టోబర్ 19:-

కాంగ్రెస్ పార్టీ అనాలోచిత వైఖరితో పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారని, రాష్ట్రంలో విద్యావ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా బ్రష్టు పట్టించిందని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ ఆరోపించారు. శనివారం ఒక ప్రకటనలో సతీష్ కుమార్ ఈ విధంగా పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి అనాలోచిత విధానాల వల్ల రాష్ట్రంలో పేద విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారని విమర్శించారు. తెలంగాణలో విద్యావ్యవస్థపై రాష్ట్ర ప్రభుత్వానికి ఏ పార్టీ చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవచ్చని ఎద్దేవా చేశారు.  గురుకుల భవనాలకు అద్దె చెల్లిస్తలేరని, పేద విద్యార్థులకు కనీసం అన్నం పెట్టలేని స్థితికి కాంగ్రెస్ ప్రభుత్వం దిగజారిందని మండిపడ్డారు. రాష్ట్రానికి విద్యా శాఖ మంత్రి లేడని, ముఖ్యమంత్రికి విద్యారంగంలో సమస్యలను తెలుసుకునే ఓపిక లేదన్నారు. రాష్ట్రంలో విద్యార్థులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాల్సింది పోయి విద్యార్థుల జీవితాలతో రేవంత్ సర్కార్ చెలగాట మాడుతోందని,  విద్యార్థులకు అన్యాయం చేస్తామంటే బీఆర్ఎస్ సహించదని, కాంగ్రెస్ సర్కార్ మెడలు వంచి విద్యార్థులకు న్యాయం చేసే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర రాజధానిలో అశోక్ నగర్ ప్రాంతంలో గ్రూప్-1 పరీక్షను వాయిదా వేయాలని కోరినందుకు అభ్యర్థులపై పోలీసుల దాష్టీకాన్ని ఖండించారు. గ్రూప్-1 అభ్యర్థులను హాస్టల్లోకి చొచ్చుకెళ్లి మరి అరెస్టులు చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. గ్రూప్ వన్ పరీక్షను తక్షణమే అభ్యర్థుల కోరిక మేరకు పరీక్ష షెడ్యూల్ ను సవరించాలని డిమాండ్ చేశారు. ‘వియ్‌ వాంట్‌ జస్టిస్‌’ అంటూ నినదించే గొంతులను పోలీసులు అత్యంత కర్కశంగా నొక్కేయడం సరి కాదన్నారు. కనీసం తాగేందుకు నీళ్లు కూడా ఇవ్వకుండా అమానవీయంగా ప్రవర్తించడాన్ని ఖండించారు. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ తో పాటు ప్రైవేటు కళాశాలల మెయింటెనెన్స్ బకాయిలను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *