ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు ఏకాభిప్రాయంతో చర్చలు జరపాలి..
ఏపీలో ఉన్న తెలంగాణ ఉద్యోగులను రాష్టానికి పంపించాలి..
గురు శిష్యుల మధ్య సమన్వయ ఒప్పందం జరగాలి..
కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు..
సిద్దిపేట టైమ్స్,దుబ్బాక ప్రతినిధి
నేడు జరగబోయే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో రాష్ట్ర ప్రజలకు ఆనందం పంచె రీతిలో ఉండాలని కోరుకుంటున్నానని మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు అన్నారు. శనివారం రోజున తిరుమలలో కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకుని మాట్లాడారు. గత పది సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న విభజన సమస్యలను ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమన్యాయం చేసే విధంగా పనిచేయాలన్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య చాలా సన్నిత సంబంధం లేకుండా అని ఒకరకంగా చెప్పుకోవాలంటే ఇద్దరినీ గురు శిష్యులుగా అన్నారు. పెండింగ్ లో ఉన్న భాగ్యనగరంలో ఆంధ్రప్రదేశ్ చెందాల్సిన వాటాలను న్యాయబద్ధంగా ఇవ్వాలన్నారు. అంతేకాకుండా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల మధ్య ఏకాభిప్రాయం ఉన్నందున ఇద్దరు కలిసి ఒకే పార్టీలో పని చేసిన సన్నితం కూడా ఉన్నందున ఆంధ్రప్రదేశ్ లో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను తెలంగాణ రాష్ట్రానికి పంపించేందుకు ఏకాభిప్రాయంతో నిర్ణయాలు తీసుకోవాలన్నారు. నేడు జరగనున్న ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం తూతూ మంత్రంగా నిర్వహించకుండా నిర్వహించాలన్నారు. దశాబ్ది కాలం నుంచి ఇరు రాష్ట్ర ప్రజలు కోరుకున్న సమస్యలు తీర్చే విధంగా ముఖ్యమంత్రులు ఏకాభిప్రాయానికి రావాలని వారన్నారు.