ఏసీబీకి పట్టుబడ్డ ఉత్తమ అధికారి..
ఉపాధి హామీ ఈసీ పర్శరాములు..
సిద్దిపేట టైమ్స్,మద్దూరు:
మద్దూరు మండల మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ఇంజనీరింగ్ కన్సల్టెంట్(ఈసీ) బండకింది పర్షరాములు ఏసీబీకి అధికారులకు మంగళవారం పట్టుబడ్డారు.మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ఇంజనీరింగ్ కన్సల్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న పర్షరాములు ఫైళ్ల చెక్ కొలతను ధృవీకరించడం, పూర్తి చేయడం మరియు బిల్లు ఆమోదం కోసం ఉన్నత అధికారులకు పంపడం కోసం ఫిర్యాదుదారుడి నుండి రూ.11,500 లంచం డిమాండ్ చేశారు.ఈ మేరకు ఈసీ కార్యాలయంలో పరుషరాములు డబ్బులు తీసుకుంటున్న క్రమంలో రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.ఈనెల15న స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈసీ పరశురాములుకు సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి మరియు రవాణా,బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా ఉత్తమ అధికారిగా ప్రశంస పత్రం అందుకున్నారు. అంతలోనే 15 రోజులు నిండకముందే ఏసీబీ వలలో పర్శరాములు చిక్కుకోవడంతో మండలం మొత్తం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అలాగే మద్దూరు మరియు ధూళిమిట్ట తహసీల్దార్ కార్యాలయాల్లో అధికారులు కూడా లంచాలు తీసుకుంటున్నట్లు పలువురు ప్రజలు ఆరోపిస్తున్నారు.ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు లంచం అడిగితే చట్ట ప్రకారం చర్య తీసుకోవడానికి ప్రజలు ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064 ను సంప్రదించాలని ఏసీబీ అధికారులు తెలిపారు.





