రైలు రాక.. బ్రిడ్జిపై నుంచి దూకేసిన దంపతులు
సిద్దిపేట టైమ్స్ డెస్క్:
రైల్వే బ్రిడ్జిపై ఫొటోషూట్ భార్యా భర్తల ప్రాణాల మీదకు తెచ్చింది. రాజస్థాన్‌లో పాలి(D)లోని గోరంఘాట్ బ్రిడ్జిపై దంపతులు రాహుల్, జాన్వి ఫొటోషూట్ చేస్తున్నారు. ఆ సమయంలో రైలు రాగా వారు భయంతో 90అడుగుల లోతులోకి దూకేశారు. రైలు వేగం తక్కువగా ఉండటంతో లోకో పైలట్ ట్రైన్‌ను ఆపేశారు. అనంతరం పోలీసుల సాయంతో ఆస్పత్రికి తరలించారు. భార్యకు కాలు విరగగా, భర్త వెన్నెముకకు తీవ్ర గాయమైంది. ఈ ప్రమాద వీడియో వైరల్ అవుతోంది.