తెలంగాణ సిద్దాంతకర్త ప్రొపెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా కోహెడ మండల కేంద్రంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు పిడిశెట్టి రాజు
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
నాలుగున్నర కోట్ల తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను సాధించడంలో ముఖ్య భూమికను పోషించిన ప్రొపెసర్ జయశంకర్ సార్ వర్ధంతి వేడుకలు జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు పిడిశెట్టి రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా భారతీయ జనతాపార్టీ మండల అధ్యక్షులు ఖమ్మం వేంకటేశం హాజరై జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్బంగా ప్రైవేట్ హాస్పిటల్ లో రోగులకు పండ్లు, బ్రేడ్ పంపిణీ చేసిన అనంతరం వారు మాట్లాడుతూ బీసీ విశ్వబ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన కొత్తపల్లి జయశంకర్ సార్ భారతీయ విద్యావేత్త మరియు సామాజిక కార్యకర్త తెలంగాణ ఉద్యమానికి ప్రముఖ సిద్ధాంతకర్త అతను 1952 నుండి ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడాడు నదీజలాల అసమాన పంపిణీ ప్రత్యేక తెలంగాణా ఉద్యమానికి మూల కారణమని పేర్కొన్నారు. వారి లేని తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటు అని ఖమ్మం వేంకటేశం అన్నారు సామాజిక కార్యక్రమాలను క్రమం తప్పకుండా చేసే పిడిశెట్టి రాజు ని అభినందించారు.
ఈ కార్యక్రమంలో బీసీ జనసేన రాష్ట్ర అధ్యక్షులు గోవిందు సురేష్ నేత, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు తంగళ్లపల్లి చిగురు కొమురయ్య, బీజేపీ సీనియర్ నాయకులు శ్రీరాములపల్లి చిగురు రాజిరెడ్డి, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భైరి సుధాకర్, యాదవ చైతన్యదిక రాష్ట్ర నాయకులు గొర్ల వెంకటస్వామి యాదవ్, నాయీబ్రాహ్మణ సంక్షేమ సంఘం నాయకులు శ్రావణపల్లి దాసు, ఎనగందుల కొమురయ్య, వి సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.