తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలి
ఎస్సీ వర్గీకరణ తీర్పును హర్షిస్తూ నరేంద్ర మోదీ, మంద కృష్ణ మాదిగ ల చిత్ర పటాలకు పాలాభిషేకం..
ఎస్సీ వర్గీకరణ, మాదిగల అభ్యున్నతికి కృషి చేసిన ఏకైక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల శంకర్ బాబు

సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
శుక్రవారం హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఎస్సీ వర్గీకరణకు సానుకూలమైన తీర్పును హర్షిస్తూ బీజేపీ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు కొంకటి కిశోర్ ఆధ్వర్యంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ కి ధన్యవాదాలు తెలియజేస్తూ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి, నరేంద్ర మోదీ, మంద కృష్ణ మాదిగ ల చిత్ర పటాలకు పాలాభిషేకం చేసి, టపాసులు కాల్చి, స్వీట్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా “బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల శంకర్ బాబు” మాట్లాడుతూ.. 30 సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం మంద కృష్ణ మాదిగ నేతృత్వంలో దండోరా ఉద్యమంతో అనేక పోరాటాలు, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారని, ఎంతోమంది కార్యకర్తలు ఉద్యమంలో అసువులు బాసిన చరిత్ర ఎస్సీ వర్గీకరణ ఉద్యమమన్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక చోరవ తీసుకుని ఎస్సీ వర్గీకరణకు సానుకూలమైన తీర్పు రావడానికి కృషి చేశారని, వారితో పాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్, ఎంపీ ఈటెల రాజేందర్ ఎస్సీ వర్గీకరణ కోసం కృషి చేశారని వారికి ధన్యవాదాలు తెలిపారు. మూడు దశాబ్దాల నిరీక్షణకు తెరపడి ఎస్సీ వర్గీకరణ విషయంలో సానుకూలమైన తీర్పు రావడం సంతోషదాయకమన్నారు. దీంతో విద్యా, ఉద్యోగాల్లో మాదిగ, మాదిగ ఉప కులాలకు లబ్ది చేకూరుతుందని హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎస్సీ వర్గీకరణను తెలంగాణలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల విడుదలైన జాబ్ నోటిఫికేషన్లో ఎస్సీ రిజర్వేషన్లు వర్తింపజేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గోళ్లపెల్లి వీరాచారి, బీజేవైయం జిల్లా అధికార ప్రతినిధి పెందోట భూశంకరాచారీ, పట్టణ ప్రధాన కార్యదర్శి తగరం లక్ష్మణ్, ఉపాధ్యక్షులు గాదాసు రాంప్రసాద్, కోశాధికారి అకోజు అరుణ్ కుమార్, కార్యదర్శి వడ్డెపల్లి లక్ష్మణ్, బీజేవైయం పట్టణ అధ్యక్షుడు పోలోజు రాజేందర్, మండల కార్యదర్శి సిరికొండ జగదీశ్వీర చారీ, పట్టణ సోషల్ మీడియా కన్వీనర్ బొనగిరి రాజేష్, బీజేపీ సీనియర్ నాయకులు చిట్టి గోపాల్ రెడ్డి, బొనగిరి రవి, కురిమెల్ల శ్రీనివాస్, మరియు బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.