ప్రకృతిని దేవతగా కొలిచే సంస్కృతి తెలంగాణది
గౌరమ్మ, దుర్గమ్మ దీవెనలతో హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు సుభిక్షంగా ఉండాలి
హుస్నాబాద్ నియోజకవర్గం ప్రజలకు సద్దుల బతుకమ్మ, విజయదశమి శుభాకాంక్షలు
మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్ :
ప్రకృతిని దేవతగా కొలిచే సంస్కృతి కేవలం తెలంగాణ ప్రజలకు మాత్రమే సొంతమని, ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి సంస్కృతి కనబడదని మాజీఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ అన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గ ఆడపడుచులకు, ప్రజలకు సతీష్ కుమార్ సద్దుల బతుకమ్మ, విజయదశమి దసరా శుభాకాంక్షలను తెలిపారు. బతుకమ్మ, గౌరమ్మ, దుర్గామాతల
దీవెనలతో హుస్నాబాద్ నియోజకవర్గం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక, మాజీ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మ, దసరా పండుగలను ఘనంగా నిర్వహించేలా ప్రత్యేక చర్యలు చేపట్టిన అంశాలను, ఆడపడుచులకు సారిగా బతుకమ్మ చీరలను పంపిణీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. నియోజకవర్గ ప్రజలు బతుకమ్మ, దసరా వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని సూచించారు. ఈ విజయదశమి ప్రజలందరికీ విజయాలను సాధించి పెట్టాలని
భవానీమాతను కోరుకున్నట్లు చెప్పారు.