సిద్దిపేట టైమ్స్ వెబ్ డెస్క్:
Telangana election results 2024: తెలంగాణ లోకసభ ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో వెలువడనున్నాయి. ఈవీఎంలలో నిక్షిప్తమైన అభ్యర్థుల భవిష్యత్తు మరికొన్ని గంటల్లో తేలనుంది. మొదట పోస్టల్ బ్యాలెట్లు లెక్కించిన తర్వాత ఈవీఎంల లెక్కింపు. ఈరోజు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. పోటా పోటీగా సాగిన తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు తలపడ్డాయి. ఓటర్లు ఎవరికి తీర్పు ఇచ్చారు అన్నది కొన్ని గంటల్లో తేలిపోనుంది. జూన్ 1న వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో ఉత్కంఠను పెంచింది.
ఈరోజు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. తొలి ఫలితం మధ్యాహ్నం ఒంటి గంట వరకు, తుది ఫలితం సాయంత్రం 6 గంటల వరకు వచ్చే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. అయితే మొదటి ఫలితం నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో వెలువడనుంది. ఈ నియోజకవర్గంలో కేవలం 15 రౌండ్లలోనే ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయి.. ఫలితం వెల్లడించనున్నారు.
కరీంనగర్, నల్గొండ, హైదరాబాద్ నియోజకవర్గాల్లో ఫలితాలు చివరిలో వెలువడే అవకాశం ఉంది. ఈ మూడు నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపు 24 రౌండ్లలో జరుగుతుంది. మొత్తానికి ఈసారి తెలంగాణ లోక్ సభ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.