ఉపాధ్య వృత్తి పవిత్రమైనది.. కొడపాక ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు రంగారెడ్డి..

ఉపాధ్య వృత్తి పవిత్రమైనది.. కొడపాక ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు రంగారెడ్డి..

ఉపాధ్య వృత్తి పవిత్రమైనది..
చేసిన సేవలే గుర్తుంపునిస్తాయి..
కొడపాక ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు రంగారెడ్డి..
సేవలు మరువలేనివి..
జిల్లా విద్యాధికారి ప్రొఫెసర్
రాధాక్రిష్ణ….

సిద్దిపేట టైమ్స్:మెదక్ ప్రత్యేక ప్రతినిధి:

ఉపాద్యాయులు చేసిన సేవలే గుర్తింపు నిస్తాయని మెదక్ జిల్లా విద్యాధికారి ప్రొఫెసర్ రాధాక్రిష్ణ అన్నారు.పాపన్నపేట్ మండలం కోడపాక ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు రంగారెడ్డి పదవీవిరమణ ఆత్మీయ సన్మనసభకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.ప్రధానోపాధ్యాయులు ఆరోగ్యం అధ్యక్షతన ఏర్పాటైన సభలో ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి,నీలకంఠం, ఏ ఎస్ ఓ ఎం నవేంకుమార్ జిల్లా పీ అర్ టీ యు అధ్యక్షులు సుంకరి కృష్ణ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాధికారి ప్రొఫెసర్ రాధాక్రిష్ణ మాట్లాడుతూ ఎందరో విద్యార్థుల జీవితాలలో వెలుగు లు నింపి వారి బంగారు భవిష్యత్తు నిర్మాణంలో ఉపాధ్యాయుని పాత్ర ఎంత గొప్పదని అన్నారు.
పదవి విరమణ పొందుతున్న రంగారెడ్డి ఈ పాఠశాలలోనే 20 సంవత్సరాలు అంకిత భావంతో పనిచేయడం ,క్రమశిక్షణ కు మారుపేరుగా ఆయన సేవలు కొన సాగారుసారు. .17 బ్యాచుల  విద్యార్ధిని విద్యార్థులు రంగారెడ్డి సేవలను గుర్తించుకుంటారని కొనియాడారు.ఉపాద్యాడు ఎల్లప్పుడూ మార్గదర్శిగా విద్యావేత్తగా అంటూ వారి అనుభవాన్ని సేవల రూపంలో విద్యార్థులకు బోధన చేస్తూ వారు ఉన్నత శిఖరాలు అదిరోహించుటలో తోడ్పాటును రంగారెడ్డి అందించారని రాధాకిషన్ కొనియాడారు.విద్యార్థుల నిజమైన సామర్థ్యాలను గుర్తించి ఆయా రంగాలలో నిష్ణాతులైన విద్యార్థులను తయారు చేయడంలో ఉపాద్యాయులు పాత్ర మరువలేనిదని అన్నారు.మెదక్ మండల విద్యాధికారి నీలకంఠం మాట్లాడుతూ విద్యార్థుల నమోదు ను పెంచాలని తద్వారా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
  
రంగారెడ్డి దంపతులకు       డి ఈ ఓ సన్మానం…

పదవి విరమణ పొందిన ఉపాద్యాయుడు రంగారెడ్డి రామేశ్వరి, దంపతులను జిల్లా విద్యాధికారి ప్రొఫెసర్ రాధాక్రిష్ణ శాలువా తో సన్మానించి మెమోంటోనూ అందించారు.ఈ సందర్భంగా విద్యార్ధిని, విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు,ప్రజా ప్రతినిధులు రాములు ,బీమప్ప,ప్రవీణ్ కాశీనాథ్, మింగర్తి రాములు,,వెంకటరమణ, వెంకట్ రెడ్డి,రమేష్,చంద్ర శేఖర్,శంకర్ రెడ్డి,నవీన్,ప్రసాద్,సాయిలు,కొండల్ రెడ్డి,వివిధ ఉపాధ్యా సంఘాల నేతలు పాల్గొన్నారు..

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *