అక్రమ ఇసుక డంపుపై టాస్క్ ఫోర్స్ కొరడా: 70 టన్నుల ఇసుక స్వాధీనం
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో అక్రమ ఇసుక రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని బస్వాపూర్ గ్రామ శివారులో మామిడి లక్ష్మణ్ తండ్రి మల్లయ్య, నివాసం అక్కెనపల్లి, మండలం నంగునూరు అతను ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక డంపు చేసి అధిక ధరలకు విక్రయించేందుకు సిద్ధం చేస్తున్నాడన్న సమాచారాన్ని ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు.
నమ్మదగిన సమాచారాన్ని అందుకున్న సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు, కోహెడ పోలీసుల సహకారంతో సంఘటితంగా దాడులు నిర్వహించి సుమారు 70 టన్నుల అక్రమ ఇసుకను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కోహెడ ఎస్‌ఐ అభిలాష్ కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు.
ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ అధికారులు మాట్లాడుతూ – “ఇసుక, పిడిఎస్ బియ్యం, మొరము, మట్టి వంటి వాటిని ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా రవాణా చేసినా,
పేకాట, గంజాయి, ఇతర మత్తు పదార్థాల విక్రయం చేసినా, ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్నా
వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం” అని హెచ్చరించారు.
ఇలాంటి కార్యకలాపాలపై సమాచారాన్ని ఇవ్వాలంటే సిద్దిపేట టాస్క్ ఫోర్స్ నెంబర్లు: 8712667445, 8712667446, 8712667447 లకు సమాచారం అందించిన వారి వ్యక్తిగత వివరాలు గోప్యంగా ఉంచుతామని అధికారులు స్పష్టం చేశారు.
Posted inసిద్దిపేట హుస్నాబాద్
అక్రమ ఇసుక డంపుపై టాస్క్ ఫోర్స్ కొరడా: 70 టన్నుల ఇసుక స్వాధీనం
