ఇండియన్ టాలెంట్ ఒలింపియాడ్ లో అంబిటస్ విద్యార్థుల ప్రతిభ..మూడు రాష్ట్రస్థాయి ర్యాంకులు కైవసం..మరో ఆరు ఎక్సలెన్స్ అవార్డులు..

ఇండియన్ టాలెంట్ ఒలింపియాడ్ లో అంబిటస్ విద్యార్థుల ప్రతిభ..మూడు రాష్ట్రస్థాయి ర్యాంకులు కైవసం..మరో ఆరు ఎక్సలెన్స్ అవార్డులు..

ఇండియన్ టాలెంట్ ఒలింపియాడ్ లో అంబిటస్ విద్యార్థుల ప్రతిభ..
మూడు రాష్ట్రస్థాయి ర్యాంకులు కైవసం..
మరో ఆరు ఎక్సలెన్స్ అవార్డులు..
50 మందికి మెడల్స్ బహూకరణ
మొదటి రౌండ్ కు 232 మంది విద్యార్థులు హాజరు..
158 మంది సెకండ్ రౌండ్ కు ఎంపిక..
జాతీయస్థాయిలో ప్రతిభ చూపిన విద్యార్థులు..
జాతీయస్థాయిలో గోల్డెన్ స్కూల్ గా గుర్తింపు దక్కించుకున్న స్కూల్..
అభినందించిన స్కూల్ కరస్పాండెంట్, ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్..


సిద్దిపేట టైమ్స్ సిద్దిపేట ప్రతినిధి:
జాతీయ స్థాయిలో నిర్వహించిన ఇండియన్ టాలెంట్ ఒలంపియాడ్ టెస్ట్ లో అంబిటస్ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. గత డిసెంబర్  2023- 24 సంవత్సరానికి గాను నిర్వహించిన జాతీయ స్థాయి టెస్టులో  స్కూల్ విద్యార్థులు మూడు రాష్ట్రస్థాయి ర్యాంక్ లతోపాటు, 6 ఎక్సలెన్స్ అవార్డులను సొంతం చేసుకున్నారు. అలాగే 50 మంది విద్యార్థులు మెడల్స్ గెలుచుకోగా, 158 మంది విద్యార్థులు పార్టిసిపేషన్ సర్టిఫికెట్లను సాధించారు.

అంబిటస్ కు ర్యాంకుల పంట…

జాతీయ స్థాయిలో నిర్వహించిన ఈ టెస్టులో పాఠశాల నుండి మొదటి రౌండ్లో 232 మంది విద్యార్థులు హాజరుకాగా, రెండో రౌండ్ కు 158 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. వీరిలో  కే .నీరజ్ (7వ తరగతి) జి .రక్షిత( 8వ తరగతి) ఎస్. సూర్యప్రకాష్ (పదవ తరగతి ) లు రాష్ట్రస్థాయి ర్యాంకులను కైవసం చేసుకున్నారు. అలాగే వీరితోపాటు
విశ్వతేజ, అభినయ్, మనస్విని, జి.అన్షిత, టీ .సౌమ్య,  ఆర్. అన్విత లకు ఎక్సలెన్స్ అవార్డులు రాగా, 50 మంది విద్యార్థులు గోల్డ్, సిల్వర్, బ్రాంచ్ మెడల్స్ లను సాధించారు. అలాగే పరీక్ష రాసిన 158 మంది విద్యార్థులకు పార్టిసిపేషన్ సర్టిఫికెట్లను అందజేశారు.
కాగా  జాతీయస్థాయిలో సక్సెస్ ఫుల్ గా టెస్ట్ నిర్వహించిన ఆంబిటస్ స్కూలుకు గోల్డెన్ స్కూల్ అవార్డు దక్కింది. ఒలంపియాడ్ టెస్టులో తమ పాఠశాల విద్యార్థులు స్టేట్ ర్యాంకులను సాధించడం పట్ల పాఠశాల కరస్పాండెంట్ ఎడ్ల శ్రీనివాస్ రెడ్డి, ప్రిన్సిపల్ ఎడ్ల జ్యోతి శ్రీనివాస్ రెడ్డి, వైస్ ప్రిన్సిపల్ విజయభాస్కర్ హర్షం వ్యక్తం చేశారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను వారు అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని ర్యాంకులు, మెడల్స్ ను సాధించి స్కూలుకు,  తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *