ఆర్టీసీ కార్గో సేవలను సద్వినియోగం చేసుకోవాలి
కరీంనగర్ రీజియన్ లాజిస్టిక్ మేనేజర్-ఏటీఎం రామారావు
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
కోహెడ, సైదాపూర్ మండల కేంద్రంలలో ఆర్టీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్గో సేవలను మండల కేంద్రంలోని ప్రజలతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు, వ్యాపారులు సద్వినియోగం చేసుకోవాలని కరీంనగర్ రీజియన్ లాజిస్టిక్ మేనేజర్-ఏటీఎం రామారావు కోరారు. గురువారం కోహెడ, సైదాపూర్ మండల కేంద్రాలలో ఆర్టీసీ కార్గో లాజిస్టిక్ కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్సిల్, కొరియర్ సర్వీసులు తెలంగా ణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలతో పాటు పలు పట్టణ, నగరాలలో కార్గో సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అన్ని ప్రాంతాలకు కొరియర్, కవర్లు తక్కువ చార్జీలతో రవాణా చేస్తున్నామని ఇట్టి సౌకర్యాన్ని ప్రజలు, వ్యాపారులు వినియోగించుకోవాలని కోరారు. మరిన్ని వివరాల కోసం కరీంనగర్ ఏవో రాజు 9154298581, 9154298673, 9154298675 నంబర్లను సంప్రదించాలన్నారు. ఈకార్యక్రమంలో రాజు సేల్స్ టీం లీడర్, అన్వేశ్ ఆపరేషన్ టీం లీడర్, చంద్రమౌళి హుజురాబాద్ డీఎంఈ, సురేశ్ హుస్నాబాద్ డీఎంఈ, సైదాపూర్ లాజిస్టిక్-కార్గో ఏజెంట్ తిరుపతి, గ్రామ నాయకులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
