ఆర్టీసీ కార్గో హోం డెలివరీ సేవలను సద్వినియోగం చేసుకోవాలి
ఉమ్మడి కరీంనగర్ జిల్లా లాజిస్టిక్స్ మేనేజర్ రామారావు
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:

టి జి ఎస్ ఆర్టీసీ కార్గో ఆధ్వర్యంలో అందిస్తున్న హోం డెలివరీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా లాజిస్టిక్స్ మేనేజర్ రామారావు తెలియజేశారు. శుక్రవారం రోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లా రీజినల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ రాజుతో కలిసి హుస్నాబాద్ లాజిస్టిక్స్ కౌంటర్ ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో వేగవంతమైన సేవలను అందించేందుకు హోం డెలివరీ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్లోని 31 ప్రాంతాల్లో ఉన్న కేంద్రాల నుంచి హోం డెలివరీ సేవలు అందుబాటులో ఉంటాయని వివరించారు. హుస్నాబాద్ పరిసర ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. వివరాలకు డిపో మేనేజర్, కార్గో నిర్వహకులను సంప్రదించాలన్నారు. దీంట్లో భాగంగా హుస్నాబాద్ పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ జంట నగరాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన హోమ్ డెలివరీ సర్వీసులను అత్యధికంగా వినియోగించుకొని మీ యొక్క వస్తువుల్ని వేగంగా భద్రంగా గమ్యానికి చేర్చుకోగలరని ఏటీఎం రామారావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ డిపో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ సురేష్ మరియు కౌంటర్ సిబ్బంది పాల్గొన్నారు.