రైతులకు తీపి కబురు.. ఖాతాలోకి పీఎం కిసాన్ డబ్బు..?
సిద్ధిపేట టైమ్స్, వెబ్
దేశవ్యాప్తంగా రైతులకు కేంద్రంలో కొత్తగా కొలువుదీరిన మోదీ సర్కార్ 3.0 పెద్ద శుభవార్త చెప్పింది. ఈ సారి ముందుగా ప్రధాని తన ప్రస్థానాన్ని రైతులకు మేలు చేసే కార్యక్రమం నుంచి ప్రారంభించిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 17వ విడత సొమ్ము జమ కోసం నిరీక్షణకు తెరపడనుంది.
కేంద్రంలో ఎన్డీఎ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన వెంటనే, రైతుల కోసం తదుపరి విడత పీఎం కిసాన్ సమ్మాన్ నిధిని మంజూరు చేసే ఫైలుపై సంతకం చేశారు.దీంతో కోట్ల మంది రైతుల ముఖంలో ఆనందం వెల్లివిరిసింది.తాజాగా వారి ఖాతాల్లో డబ్బు జమకు సంబంధించిన తేదీ వివరాలు వెలువడ్డాయి.
అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం జూన్ 18,2024న మొత్తం దాత ఖాతాలో జమ చేయబడుతుందని సమాచారం. ప్రధాని మోదీ జూన్ 18న వారణాసిలో పర్యటిస్తుండగా.. అక్కడి నుంచి DBT ద్వారా దేశంలోని 9.3 కోట్ల మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు 20,000 కోట్లు బదిలీని పరిశీలిస్తారని తెలుస్తోంది. వాస్తవానికి..పీఎం కిసాన్ యోజన అనేది పేద రైతుల సంక్షేమం కోసం మోదీ సర్కార్ తీసుకొచ్చిన స్కీమ్. రైతు బంధు పేరుతో తెలంగాణలో గత ప్రభుత్వం అమలు చేసిన పథకాన్ని దేశవ్యాప్తంగా రైతులకోసం మోదీ విస్తరించారు.



