తెలంగాణ ఏర్పాటులో చిన్నమ్మ సుష్మా స్వరాజ్ కృషి మరువలేనిది
హుస్నాబాద్ పట్టణ బిజెపి అధ్యక్షుడు దొడ్డి శ్రీనివాస్
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
నాలుగుకోట్ల ప్రజల చిరకాల ఆకాంక్షనే కాకుండా, ప్రజల అస్తిత్వపు ఆత్మగౌరవ పోరాటం ఈ తెలంగాణ. అమరవీరుల పోరాట ఫలితంగా చిన్నమ్మ సుష్మా స్వరాజ్ వంటి ఎందరో మహనీయుల యోగ దానంతో అరవయేండ్ల తండ్లాటను జయించి, రాష్ట్రాన్ని సాధించుకున్న మహత్తర మహిమాన్విత నేల ఇది. అమరవీరుల ఆత్మార్పణమే రాష్ట్ర సాకారమై, దశాబ్ది ఉత్సవమై నిలిచిన ఈ సందర్భంగా అమరవీరులకు అంజలి ఘటిస్తూ… బిజెపి హుస్నాబాద్ పట్టణశాఖ ఆధ్వర్యంలో గాంధీ చౌరస్తాలో ఈరోజు ఉదయం బిజెపి పట్టణ అధ్యక్షులు & కౌన్సిలర్ దొడ్డి శ్రీనివాస్ జాతీయ పతాకను ఆవిష్కరణ చేసిన కార్యక్రమంనకు అతిధిగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు & హుస్నాబాద్ అసెంబ్లీ కోఆర్డినేటర్ కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు లక్కీరెడ్డి తిరుమల, రూరల్ మండల అధ్యక్షులు వెలదండి రాజేంద్రప్రసాద్, సీనియర్ బిజెపి నాయకులు కొత్తపల్లి అశోక్, చిట్టి గోపాల్ రెడ్డి, బోనగిరి రవి, ఒగ్గొజు వెంకటేష్, సంతోష్, ప్రధాన కార్యదర్శులు రాయకుంట చందు, తగరమా లక్ష్మణ్, సంపత్ నాయక్, పట్టణ ఉపాధ్యక్షులు రాంప్రసాద్, మహేష్కర్, నాగార్జున బీజేవైఎం ప్రధాన కార్యదర్శులు సాంబరాజు, సాయికృష్ణ, వడేపల్లి లక్ష్మయ్య, కర్నాల వెంకన్న, చంద్రమౌళి, శివ తదితరులు పాలుగోన్నారు.