దసరా లక్కీ డ్రా పేరుతో ఆశ్చర్యకరమైన ఆఫర్లు..
సిద్దిపేట టైమ్స్, తెలంగాణ
తెలంగాణలో బతుకమ్మ, దసరా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.. ఇక దసరా సందర్భంగా కొందరు లక్కీ డ్రా పేరిట ఆశ్చర్యకరమైన ఆఫర్లు ప్రకటిస్తున్నారు. జనాన్ని ఆకట్టుకుని తమ జేబులు నింపుకునేందుకు ప్లాన్లు రూపొందిస్తున్నారు. అందులో భాగంగానే జగిత్యాల జిల్లా సారంగాపూర్‌లో దసరా ఉత్సవాలు ఉత్సాహం కాస్త వింతగా మారింది. కొందరు నిర్వాహకులు లక్కీ డ్రా పేరుతో ఆశ్చర్యకరమైన ఆఫర్లు ప్రకటించారు. రూ.150 చెల్లించి కూపన్ కొనుగోలు చేస్తే, బహుమతులు గెలిచే అవకాశం ఉందని ప్రకటించారు. మొదటి బహుమతిగా మేక, రెండో బహుమతిగా బీర్ కాటన్, మూడో బహుమతిగా ఒక మద్యం ఫుల్ బాటిల్, నాలుగవ బహుమతిగా నాటుకోడి, ఐదో బహుమతిగా చీర అందిస్తామని తెలిపారు.





