ఇలాంటి పోలీసు నిర్బంధాలు మాకు… మా పార్టీకి కొత్త కాదు.. బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఎం పద్మ దేవేందర్ రెడ్డి..

ఇలాంటి పోలీసు నిర్బంధాలు మాకు… మా పార్టీకి కొత్త కాదు.. బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఎం పద్మ దేవేందర్ రెడ్డి..

ఇలాంటి పోలీసు నిర్బంధాలు మాకు… మా పార్టీకి కొత్త కాదు .

బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఎం పద్మ దేవేందర్ రెడ్డి.

సిద్దిపేట్ టైమ్స్ మెదక్ ప్రతినిధి అక్టోబర్ 9

ఆర్టీసీ చార్జీల పెంపు నిర్ణయాన్ని తక్షణం వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ బీఆర్‌ఎస్‌ ‘చలో బస్‌భవన్‌’ కార్యక్రమాన్ని చెప్పటింది . ఈ నేపథ్యంలో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను, మాజీ మంత్రి హరీష్ రావు ను,
బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను,తనతోపాటు బీఆర్‌ఎస్‌ నాయకుల ఇండ్ల ముందు భారీగా పోలీసుల మోహరింపుపై, ప్రభుత్వం పైన పద్మాదేవేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ… పెంచిన చార్జీలకు వ్యతిరేకంగా శాంతియుతంగా బస్సు భవన్ కు వెళ్లి ఒక వినతి పత్రం ఇద్దామని పార్టీ పిలుపునిచ్చింది. చార్జీలను వెనక్కి తీసుకోవాలని కోరాలని అనుకున్నాం.10 సంవత్సరాలలో కెసిఆర్ ప్రభుత్వంలో బస్సు చార్జీలు పెంచలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 22 నెలలకి బస్సు చార్జీలు పెంచడంపై మండిపడ్డారు. ఫ్రీ బస్సు అంటూనే బస్సు చార్జీలు పెంచడం సామాన్య మానవుల పై భారం పడడం అన్యాయమని అన్నారు. చలో బస్‌భవన్‌ కు వెళ్లనియ్యకుండా ఆపడం కోసం ఇంతమంది పోలీసులను నాయకుల ఇంటి ముందుకు పంపారని మండిపడ్డారు. ఎన్ని రకాల కుట్రలు చేసినా రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సు చార్జీలను వెనక్కి తీసుకొనే దాకా నిరసన తెలుపుతూనే ఉంటామని,ఇలాంటి పోలీసు నిర్బంధాలు తముకు, బీఆర్‌ఎస్‌ పార్టీకి కొత్త కాదని స్పష్టం చేశారు. పెంచిన బస్సు చార్జీలను వెనక్కి తీసుకోవాలని బస్సు పవన్ కు వెళ్లి వినతి పత్రం అందజేస్తాం అంటే వెళ్లకుండా పొద్దున్నే నాయకుల ఇంటి ముందు పోలీసులు వచ్చి హౌస్ అరెస్ట్ చేయడం ఇదేనా ప్రజాపాలన అంటే గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వమే చెప్పాలన్నారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *